Site icon NTV Telugu

LuckyBaskhar : తడిసిన కళ్ళతో, నవ్వుతున్నపెదాలతో థియేటర్ నుంచి బయటకు

3vikram

3vikram

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా  దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం లక్కీ భాస్కర్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో  ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు.

Also Read : Tamannaah : అందాల తమన్నా.. ఎంత బాగుందో ముద్దుగుమ్మ..

ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “ఈ తరం గొప్ప నటులు దుల్కర్ సల్మాన్ ఒకరు. ఈ సినిమా గురించి చెప్పాలంటే. ఏ సినిమా అయినా మనం చూసేటప్పుడు మనకి అందులో ఉన్న కథానాయకుడు నెగ్గుతూ ఉండాలని కోరుకుంటాం. ఈ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, భాస్కర్ లక్కీ అవ్వాలని మనం సినిమా మొత్తం కోరుకుంటూనే ఉన్నాం. ఫైనల్ గా అతను లక్కీ గానే బయటకు వస్తాడు. ఈ సినిమాకు లక్కీ భాస్కర్ అనే టైటిల్ యాప్ట్.   దుల్కర్ మామూలు నటుడు కాదు. అతను చేసిన ప్రయత్నం మనకి కనపడకుండా ఉండటానికి అతను చేసిన ప్రయత్నానికి హ్యాట్సాఫ్. మమ్మూట్టి లాంటి మర్రిచెట్టుకి పుట్టాడు. మర్రిచెట్టు కింద మొక్కలు బ్రతకవని చెబుతుంటారు. కానీ దాని నుంచి బయటకు వచ్చి తన ప్రయాణాన్ని తను మొదలుపెట్టడం, తన రోడ్డు తను వేసుకోవడం అంటే చిన్న విషయం కాదు.  ఆయన దుల్కర్ కెరీర్ చూసి తండ్రిగా గర్వపడతారు.  తడిసిన కళ్ళతో, నవ్వుతున్న పెదాలతో థియేటర్ లోనుంచి మీ అందరూ బయటకు వస్తారు. ఈ దీపావళి వెంకీకి, ఈ సినిమాకి పని చేసిన అందరికీ చాలా ఆనందాన్ని ఇస్తుందని నాకు తెలుసు. నేను నమ్ముతూ, ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. సినిమాలో దుల్కర్ నటన చూసి ప్రేమలో పడిపోయాను ‘ అని అన్నారు.

Exit mobile version