‘ఆచార్య’ తర్వాత చిరంజీవి చేయబోతున్న సినిమా ‘లూసిఫర్’ రీమేక్. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమా అప్ కమింగ్ టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటి. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ తో పాటు ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ‘సాహో’ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో రూపొందుతుందని భావించారు. ఆ తర్వాత వివి వినాయక్ పేరు వినిపించింది. ఎందుకో ఏమో తను కూడా తప్పుకున్నాడు. మోహన్ రాజా చెప్పిన నేరేషన్ నచ్చటంతో పూజ కూడా జరిపారు. కరోనా కారణంగా అన్ని సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి. పరిస్థితి ఈ నెలాఖరుకు చక్కబడుతుందని భావిస్తున్నారు. జూలై నుంచి ఈ పొలిటికల్ డ్రామా షూటింగ్ మొదలవుతుందట. ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న ‘ఆచార్య’ ఆ తర్వాత ‘లూసిఫర్’ రీమేక్ పూర్తి కాగానే ‘వేదాళం’ రీమేక్ పట్టాలెక్కుతుందట.