అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “లవ్ స్టోరీ”. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 16న థియేటర్లలో సందడి చేయాల్సింది. కానీ కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ లవ్ స్టోరీ విడుదల వాయిదా పడింది. ఈ సినిమా విడుదలపై ఇంకా సస్పెన్స్ నెలకొంది. ప్రేక్షకులు ఈ సినిమా విడుదల గురించి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.
Read Also : కియార… ఉత్తరాది నయనతార!
మధ్యలో ఓటిటిలో సినిమా రిలీజ్ అవుతుందన్నారు. కానీ మేకర్స్ మాత్రం థియేటర్లోనే సినిమాను విడుదల చేస్తామంటూ ఇప్పటి వరకూ థియేటర్ల రీఓపెన్ కోసం ఎదురు చూశారు. ఎట్టకేలకు థియేటర్లను ఓపెన్ చేయడంతో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారట. ఈ మేరకు మూవీ రిలీజ్ డేట్ ను కూడా ఖరారు చేశారట. సమాచారం మేరకు సెప్టెంబర్ 10న “లవ్ స్టోరీ”ని ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారని తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
