Site icon NTV Telugu

Love Days : ‘లవ్ డేస్’ లెక్కపెడుతున్నారు!

Love Days

Love Days

నవీన్, కుసుమ చందక జంటగా ఆన్ క్యాన్ ఎంటర్టైన్మెంట్స్, క్రిసెంట్ సినిమాస్ బ్యానర్ల మీద మాదల వెంకటకృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ డేస్’. ఏ టాక్సిక్ లవ్ స్టోరీ అనేది ఉప శీర్షిక. ఈ మూవీని సురేష్ లంకలపల్లి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు సముద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సముద్ర మాట్లాడుతూ .. ‘‘గీతాంజలి’, ‘తొలి ప్రేమ’, ‘అందాల రాక్షసి’ లాంటి అద్భుతమైన ప్రేమ కథల్లా ఈ ‘లవ్ డేస్’ నిలిచిపోతుంది. ‘లవ్ డేస్’ పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఈ మూవీ జీవితంలో ఎన్నో మెమోరీస్‌ను అందించాలని కోరుకుంటున్నాను. మనస్పూర్తిగా ఈ మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరో నవీన్ మాట్లాడుతూ .. ‘హీరోగా ఇది నాకు తొలి చిత్రం. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మాకు మీడియా నుంచి సపోర్ట్ లభిస్తుందని ఆశిస్తున్నాను. మా గ్లింప్స్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. త్వరలోనే మేం ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నామ’ని అన్నారు.

హీరోయిన్ కుసుమ మాట్లాడుతూ .. ‘‘లవ్ డేస్’ నాకు తొలి చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన టీంకు థాంక్స్. నేను హీరోయిన్ అవ్వాలన్నది మా అమ్మ కోరిక. నేడు మా అమ్మ కోరిక నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది. మా మూవీని మీడియా, ఆడియెన్స్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

Exit mobile version