Site icon NTV Telugu

Lopaliki Ra Chepta: డెలివరీ బాయ్ చేతుల మీదుగా సాంగ్ లాంచ్

Lopaliki Ra Cheptha

Lopaliki Ra Cheptha

మాస్ బంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ గణేష్ మరియు వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న హర్రర్ బేస్డ్ కామెడీ ఎంటర్ టైనర్ “లోపలికి రా చెప్తా”. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ “లోపలికి రా చెప్తా” సినిమా మొదటి సాంగ్ నేడు విడుదల చేశారు. సహజత్వానికి భిన్నంగా ఓ సామాన్యమైన డెలివరీ బోయ్ జాఫర్ తో ఈ చిత్ర ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ప్రతిష్టాత్మకమైన సరిగమ ఆడియో కంపెనీ ఈ చిత్ర ఆడియో హక్కులు దక్కించుకుంది.

Kishan Reddy: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే గెలుపు..

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకట రాజేంద్ర మాట్లాడుతూ మా చిత్రంలో హీరో క్యారెక్టర్ డెలివరీ బాయ్. అందుకే మా చిత్రంలో మొదటి సాంగ్ ను ఓ డెలివరీ బాయ్ తో చేయాలని నిర్ణయించామని అన్నారు. అలాగే సంగీత దర్శకులు డేవ్ జాండ్ (ఈగల్ ఫేమ్ )సారథ్యంలో కపిల్ కపిలన్ ఈ పాట పాడారు. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అన్నారు. కొండా వెంకట రాజేంద్ర ,మనీషా జష్ణాని , సుస్మిత ఆనాల, సాంచి రాయ్, అజయ్ కార్తీక్, ప్రవీణ్ కటారి, రమేష్ కైగూరి ,వాణి ఐడా, తదితరులు నటిస్తున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది.

Exit mobile version