తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌కు ప్రస్తుతం ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పకర్లేదు. ‘మా నగరం’ ‘ఖైదీ’ ‘మాస్టర్’ ‘లియో’ ‘విక్రమ్’ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి విజయం సాధించిన లోకేష్ పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రజంట్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో ‘కూలీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు అందుకున్న ఈ మూవీలో రజనీకాంత్‌తో పాటుగా కింగ్ అక్కినేని నాగార్జున, ఆమీర్ ఖాన్, ఉపేంద్ర, షౌబిన్ షాహిర్, శృతి హాసన్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అయితే ఇలాంటి డ్రీమ్ కాంబినేషన్‌లో సినిమా తీయాలంటే ఏ దర్శకుడైనా మినిమమ్ ఒక ఏడాది సమయం పడుతుంది. ఎస్ ఎస్. రాజమౌళి, సుకుమార్, నాగ్ అశ్విన్ లాంటి డైరెక్టర్లు అయితే, ఎన్ని ఏళ్లు పడుతుందనేది చెప్పలేం. కానీ స్టార్ క్యాస్టింగ్‌ని పెట్టుకొని లోకేష్ 6 – 8 నెలల్లో సినిమా తీసేసాడు. కాగా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్.. ఈ విషయంపై పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.. ‘నేనేమి ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమా తీయట్లేదుగా మూడేళ్లు పట్టడానికి. ‘కూలీ’ ని 6-8 నెలల్లో పూర్తి చేశా. అలాగే నా సినిమాలో చేసే నటీనటుల్ని ఎవరినీ మీ గెటప్ మార్చొద్దు. వేరే సినిమాలు చేసుకోవద్దు అని చెప్పను. సాధారణంగా నేను అలాంటి రకం కాదు. అవేం చెప్పకపోయినా సరే వాళ్లు నాతో సినిమాలు చేస్తున్నారు’ అని లోకేష్ అన్నారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు కానీ ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండటంతో లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జక్కన్న ఫ్యాన్స్ .
