Site icon NTV Telugu

ఆ తమిళ దర్శకుడికి మైత్రి వారి భారీ రెమ్యూనరేషన్ ?

Lokesh Kanagaraj gets Huge remuneration from Mythri Movie Makers

ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ భారతదేశంలోని ప్రతిభావంతులైన దర్శకులలో ఒకరు. 2016లో ‘ఏవియల్‌’ అనే చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమా కథలపై మంచి పట్టు, అద్భుతమైన చిత్రనిర్మాణ నైపుణ్యాలతో అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు. కార్తీ నటించిన “ఖైదీ” చిత్రంతో ఈ దర్శకుడికి భారీ క్రేజ్ వచ్చింది. దీంతో తలపతి విజయ్ “మాస్టర్” చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని పొందాడు. కాగా కనగరాజ్ త్వరలోనే తెలుగు, తమిళ ద్విభాషా ప్రాజెక్టుతో టాలీవుడ్ తెరంగ్రేటం చేయనున్నట్టు కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తమ బ్యానర్ లో సినిమా తీసేందుకు కనగరాజ్ కు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చిందని వార్తలు విన్పిస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి హీరో ఇంకా ఖరారు కాలేదు. సమాచారం మేరకు ఈ ప్రొడక్షన్ హౌస్‌ టాలీవుడ్ లోని పెద్ద హీరోలనే డైరెక్ట్ చేసే అవకాశాన్ని కనగరాజ్ కు కల్పించే అవకాశం ఉంది.

Exit mobile version