వేఫేరర్ ఫిలిమ్స్ బ్యానర్ లో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించిన చిత్రం ‘కొత్త లోక చాఫ్టర్ట్ 1’. కళ్యాణి ప్రియదర్శన్, నస్లీన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. సూపర్ హీరోయిన్ చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ సినిమా ‘కొత్త లోక’ సినిమాటిక్ యూనివర్స్ లోని ఫస్ట్ పార్ట్ గా తెరకెక్కింది. భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా వచ్చిన ‘కొత్త లోక చాఫ్టర్ 1’ తోలి రోజు నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
Also Read : NBK : జైలర్ 2 నుండి తప్పుకున్న బాలయ్య… ఆ రోల్ కోసం ఎవరిని తీసుకున్నారంటే?
డే 1 నుండే రికార్థులు కొల్లగొట్టడం మొదలు పెట్టి రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ను దాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ కలెక్షన్లతో మలయాళ ఆల్ టైమ్ హయ్యెస్ట్ వసూళ్లు రాబట్టిన మోహన్ లాల్ నటించిన ఎంపురాన్ ను దాటి న్యూ మలయాళ ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచింది లోక చాప్టర్ 1. ఇప్పటికి డీసెంట్ కలెక్షన్స్ తో సూపర్బ్ గా రన్ ఆవుతోంది లోక. ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన లోక ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు అవుతోంది. ఈ సినిమా రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ నేపద్యంలో ఈ బ్లాక్‌బస్టర్ సినిమాను అక్టోబరు 31 అనగా ఈ రోజు నుండి స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది హాట్ స్టార్. తెలుగుతో పాటు అన్ని పాన్ ఇండియా భాషలలో స్ట్రీమింగ్‌కు తెచ్చింది హాట్ స్టార్. ఇప్పటికి మలయాళంలో డీసెంట్ వసూళ్లు రాబడుతోంది కొత్త లోక.
