Site icon NTV Telugu

ఐసీయూ నుంచి సీనియర్ హీరో షిఫ్ట్

Legendary Actor Dilip Kumar to be shifted out of the ICU

బాలీవుడ్ సీనియర్ హీరో దిలీప్ కుమార్ ఇటీవల ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. నెల రోజుల వ్యవధిలోనే ఆయన ఆసుపత్రిలో చేరడం ఇది రెండవసారి. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనకు గత కొన్ని రోజులుగా ఖార్‌లోని హిందూజా ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనికి ముందు దిలీప్ కుమార్ జూన్ 6న థెస్పియన్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ అతనికి బిలటేరల్ ప్లూరల్ ఎఫ్యూషన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. చికిత్స అనంతరం జూన్ 11న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తరువాత దిలీప్ కుమార్ జూన్ నెలాఖరులో మళ్ళీ అనారోగ్యం బారిన పడ్డారు.

Read Also : మోదీ సర్కార్ కొత్త చట్టంపై సుధీర్ బాబు ఆగ్రహం…

ప్రస్తుతం దిలీప్ బాగానే ఉన్నారని వైద్యులు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈరోజు ఆయనను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశారని సమాచారం. ప్రత్యేక వైద్యబృందం ఆయన ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా బాలీవుడ్ లోని అత్యుత్తమ నటులలో దిలీప్ కుమార్ ఒకరు. మొఘల్-ఈ-అజామ్, దేవదాస్, నయా దౌర్, రామ్ ఔర్ శ్యామ్ వంటి విజయవంతమైన చిత్రాలతో దాదాపు ఐదు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కొనసాగారు ఆయన. 1998లో వచ్చిన ‘కిలా’ దిలీప్ కుమార్ వెండితెరపై చివరిసారిగా కనిపించిన మూవీ.

Exit mobile version