కొంతకాలం క్రితం రాజ్ తరుణ్ ప్రియురాలిగా చెప్పుకుంటూ లావణ్య అనే యువతీ అతని మీద సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను రాజ్ తరుణ్ పెళ్లి పేరుతో వాడుకున్నాడని చేసుకోకుండా వదిలేసి మాల్వీ మల్హోత్రా అనే హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతున్నాడని ఇలా రకరకాల ఆరోపణలతో తెరమీదకు వచ్చింది. కొంతకాలం పాటు లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారం మీడియాలో కూడా విపరీతంగా వైరలైంది. తర్వాత ఏమైందో ఏమో సడన్గా ఈ అంశం మీద వార్తలు ఆగిపోయాయి. అయితే ఇప్పుడు ఆమె తాజాగా సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది. తాజాగా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఆమె ఒక విషయాన్ని వెల్లడించింది.
Mahesh Babu : మార్షల్ ఆర్స్ట్ నేర్చుకునేందుకు చైనాకు వెళ్తున్న మహేష్ ?
సెకండ్ ఇన్నింగ్స్ వస్తున్నా, ఈసారి మస్తాన్ సాయికి మూడీంది, అతని అన్ని వ్యవహారాలు బయటపెడతాను ఈ స్టోరీ సెక్స్ డ్రగ్స్ అలాగే మనీ గురించి. సోమవారం ఉదయానికి అతని డెబ్యూ వీడియోతో పని మొదలు పెడతాను అని చెబుతూనే మీడియాకి థాంక్స్ చెబుతూ ఆమె ఈ విషయాలు వెల్లడించింది. లావణ్య మస్తాన్ సాయి అనే యువకుడితో ప్రేమాయణం నడుపుతూ తనను మోసం చేసిందని అందుకే వివాహం కూడా చేసుకోవాలనుకున్న ఆమెను దూరం పెట్టానని అప్పట్లో రాజ్ తరుణ్ వెల్లడించాడు. ఇప్పుడు ఆమె మస్తాన్ సాయి గురించి కీలక విషయాలు అంటూనే సెక్స్ గురించి డ్రగ్స్ అలాగే మనీ గురించి మాట్లాడటం హాట్ టాపిక్ అవుతోంది. ఏం జరగనుంది అనేది వేచి చూడాలి.