NTV Telugu Site icon

Lavanya : కోర్టు నేను డ్రగ్స్ వాడినట్టు చెప్పిందా? కేసయితే వదిలేస్తారా?

Lavanya On Raj Tarun

Lavanya On Raj Tarun

Lavanya Says She Was not Prooven Guilty in Drugs Case: హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో పోలీసులు కేసు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్ లో రాజ్ తరుణ్ ని నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఈ అంశం మీద ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన లావణ్యను డ్రగ్స్ వాడడం వల్లే రాజ్ తరుణ్ మిమ్మల్ని వదిలేశాడు అనే వాదన వినిపిస్తోంది మరి ఆ విషయం మీద మీరేం చెబుతారు అని అడిగితే ఆమె అందుకు సమాధానం ఇచ్చింది. డ్రగ్స్ కేసు ఇంకా కోర్టులోనే ఉంది కోర్టు కూడా నేను వాడినట్టు చెప్పలేదు కదా. కొంత టైం అయినా నాకు ఇవ్వచ్చు కదా. 10 సంవత్సరాల తర్వాత నీ మీద ఒక కేసు అవుతుంది నేను వదిలేస్తానని చెప్పొచ్చు కదా.. అంటే ఈ కేసు చూపించి వదిలేస్తారా? అయినా అది ప్రూవ్ అవ్వలేదు కదా. కోర్టు నిర్ధారించలేదు కదా ఈ అమ్మాయి చేసింది అని ఆమె ప్రశ్నించారు.

Game Changer: దెబ్బకు దిగొచ్చారు.. ఇక ఆ బూతు పంచాంగం ఆపేయండ్రా అబ్బాయిలూ!

ఈ డ్రగ్స్ కేసు గురించి క్లారిటీ ఇవ్వగలరా అని అడిగితే నేను అమెరికా నుంచి వస్తున్నా, అమెరికా నుంచి వస్తున్న నేను డ్రగ్స్ అమ్మడం ఏమిటి ? నేను ఈ విషయంలో నిరపరాధిని అని నిరూపించుకుంటా. కోర్టు ఈ అమ్మాయి నిజంగానే డ్రగ్స్ అమ్మింది అని చెప్పిన రోజున రాజ్ తరుణ్ణి ఈ విషయంలో మాట్లాడమనండి. నేను చేయలేదు నేను చేయలేదు నేను చేయలేదు అని మొదటి రోజు నుంచి చెబుతున్నాను కానీ ఎవరూ వినడం లేదు. నేను ఫైట్ చేస్తున్నాను కోర్టులో స్క్వాష్ పిటిషన్ వేసాను కోర్టు చెప్పేదాకా అయినా ఆగండి అని ఆమె అన్నారు.

Show comments