Site icon NTV Telugu

Lavanya : పదిమంది జీవితాలను డిస్టర్బ్ చేసి.. నన్ను అంతం చేయాలని చూశారు!!

Lavanya Malvi

Lavanya Malvi

Lavanya Says Raj Tarun – Malvi Malhotra Tried to Kill Her: హీరో రాజ్ తరుణ్ -లావణ్య వ్యవహారం కొత్త మలుపు తిరిగింది . పోలీసులు ఈ వ్యవహారంలో కేసు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్ లో రాజ్ తరుణ్ ని నిందుతుడిగా చేర్చారు పోలీసులు. రాజ్ తరుణ్ తో లావణ్య పదేళ్లు సహజీవనం చేసిన మాట వాస్తవమేనని తేల్చారు. వీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉన్నారని లావణ్య చెబుతున్న మాట నిజమేనని తేల్చారు. ఇక ఈ అంశం మీద ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన లావణ్య ఈ ఛార్జ్ షీట్ విషయంలో నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చివరికి ధర్మమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది అని నేను ముందు నుంచి ఏదైతే నమ్ముతూ పోరాడుతూ వచ్చానో అదే నిజమైంది.

France: “నన్ను చెత్తకుండిలా చూశాడు”.. 10 ఏళ్ల పాటు 50 మందితో భార్యపై అత్యాచారం చేయించిన భర్త..

దీని నుంచి తప్పించుకోవాలని చూశారు, నన్నే అంతం చేయాలని చూశారు. మస్తాన్ సాయి కేసులో కూడా నేను బాధితురాలని. ఆ కేసు నేను కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్న సమయంలో శేఖర్ భాష, ఆ ఎఫ్ఐఆర్ సంపాదించి పదిమంది జీవితాలను డిస్టర్బ్ చేశాడు. నేను మొదటి రోజు నుంచి చెబుతున్నా, శేఖర్ భాషా ఇది కరెక్ట్ కాదు ఇలా చేయకూడదు అని. ఎవరు నన్ను పట్టించుకోలేదు, నా మాట వినలేదు. మీడియా ముందుకు వస్తే నువ్వు పర్సనల్గా దాడి చేస్తున్నామంటూ నా మీద దాడి చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన నా ప్రతి ఆడియో రికార్డ్ మస్తాన్ సై కేసులో నేను సమర్పించినవే. నేను నా స్నేహితులతో మాట్లాడిన ఆడియోస్ కూడా బయటకు వచ్చాయి కానీ అవి నాకు ఇబ్బంది అని నేను అనుకోవడం లేదు అని లావణ్య పేర్కొంది.

Exit mobile version