NTV Telugu Site icon

Lavanya : నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి మరోసారి లావణ్య

Lavanya

Lavanya

రాజ్ తరుణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో కీలక నిందితుడు మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసారు. మస్తాన్ సాయి ఆగడాలు, యువతులను బ్లాక్ మెయిల్ చేసిన హార్డ్ డిస్క్ ను లావణ్య పోలీసులకు అందజేసింది. హార్డ్ డిస్క్ లో మరికొందరి యంగ్ హీరోలకు చెందిన వారి వ్యక్తిగత వీడియోలు ఉన్నాయనే వ్యహహారం సంచలనంగా మారింది.   తాజాగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి మరోసారి వెళ్ళిన లావణ్య మస్తాన్ సాయి కేసులో డ్రగ్స్ కోణాన్ని బయటపెట్టి పలు ఆధారాలు పోలీసులకు అందజేసింది. అలాగే బిగ్ బాస్ ఫేం RJ శేఖర్ బాషా పై ఫిర్యాదు చేసింది లావణ్య.

Also Read : Bollywood : సిల్వర్ స్క్రీన్ వద్దు.. ఓటీటీ ముద్దు అంటోన్న స్టార్ కిడ్స్

మస్తాన్ సాయి, శేఖర్ బాషా ఇద్దరు కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేసారని ఫిర్యాదులో పేర్కొంది లావణ్య. అందుకు సంబందించిన ఆధారాలను పోలీసులకు అందజేసింది. మస్తాన్ సాయి, శేఖర్ బాషా మాట్లాడుకున్న ఆడియో లను పోలీసులకు అందించిన లావణ్య తనతో పాటు మరో యువతి ని కూడా ఇరికించే ప్లాన్ చేశారని పోలీసులకు వివరించింది. 150 గ్రాముల MDMA డ్రగ్స్ తెస్తాను అని లావణ్య ఇంట్లో పార్టీ ఏర్పాటు చేయమని, పార్టీలో డ్రగ్స్ పెట్టి లావణ్య ను, మరో యువతి ని ఇరికిద్ధాం అని మస్తాన్ సాయి, శేఖర్ బాషా శేఖర్ బాషా తో చెప్పినట్లు పేర్కొంది. అందుకు సంబంధించిన ఆడియో క్లిప్ ను పోలీసులకు అందజేసింది లావణ్య. ట్విస్ట్ లు, రివెంజ్ లు వాదోపవాదాలు ఇలా రోజుకొక మలుపుతో సినిమాటిక్ రేంజ్ లో ఈ కేసు సాగుతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

లావణ్య అడ్వకేట్, నాగూర్ బాబు మాట్లాడుతూ ‘ బిగ్ బాస్ ఫేం శేఖర్ బాషా పై ఫిర్యాదు చేసింది లావణ్య. లావణ్య తోపాటు మరో యువతి ని డ్రగ్స్ కేసులో ఇరికించాలని ప్లాన్ చేసారు. లావణ్య ఇంట్లో ఒక పార్టీ పెట్టుకుందాం పార్టీకి ఆ యువతిని కూడా పిలుద్దాం. పార్టీలో డ్రగ్స్ పెట్టి అక్కడి నుంచి జారుకుందాం అని శేఖర్ బాషా, మస్తాన్ సాయి మాట్లాడుకున్న ఆడియో క్లిప్ లను కూడా పోలీసులకు ఇచ్చింది. ఇందుకోసం 130 గ్రాముల MDMA డ్రగ్స్ కూడా తీసుకున్నాను అని మస్తాన్ సాయి కి వీడియో కాల్ చేసి చెప్పాడు. వాటిని కూడా పోలీసులకు అందించాం’ అన్ని అన్నారు.