Site icon NTV Telugu

“పిఎస్పీకే 28” కీలక అప్డేట్ ఇచ్చిన మేకర్స్

Latest Update from PSPK28 Movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘పిఎస్పీకే 28’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి గత కొంతకాలంగా పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా “పిఎస్పీకే 28” మేకర్స్ సోషల్ మీడియా వేదికగా కీలక అప్డేట్ ఇచ్చారు. మేకర్స్ ప్రకటించిన దాని ప్రకారం “పిఎస్పీకే 28” టైటిల్, ఫస్ట్ లుక్ ను ఉగాదికి విడుదల చేయాలనుకున్నారట. కానీ కరోనా పరిస్థితుల వల్ల పోస్టుపోన్ చేశారట. అయితే సోషల్ మీడియాలో సినిమా గురించి చాలా వార్తలు వస్తున్నాయి. కానీ సరైన సమయంలో మేమే అన్ని అప్డేట్లను అధికారికంగా ప్రకటిస్తాము అని గుర్తు పెట్టుకోండి అని పేర్కొన్నారు మేకర్స్. మరి ఇప్పటికైనా ఈ సినిమాపై వస్తున్న ఊహాగానాలు ఆగుతాయేమో చూడాలి.

Exit mobile version