Site icon NTV Telugu

“బిగ్ బాస్” లీకులకు ఇలా బ్రేక్ వేయబోతున్నాడా?

bigg-boss

బుల్లితెర పాపులర్ షోలలో ‘బిగ్ బాస్’ కూడా ఒకటి. గత సీజన్లన్నిటికీ మంచి స్పందన వచ్చింది. కరోనా ఉన్నప్పటికీ కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో గత ఏడాది “బిగ్ బాస్-4″ను విజయవంతగా పూర్తి కాగా, ప్రస్తుతం తెలుగులో “బిగ్ బాస్ సీజన్-5” ప్రారంభం కానుంది. ఈ కొత్త సీజన్ ఆగష్టు చివరి నాటికి ప్రసారం ఆయే అవకాశం ఉందని అంటున్నారు. ఈ షో కోసం ఇప్పటికే పలువురు ప్రముఖులను సంప్రదిస్తున్నారు నిర్వాహకులు. అయితే గత మూడు సీజన్లలోనూ జరిగిన లీకులు అటు నిర్వాహకులను ఇబ్బంది పెట్టగా… ఇటు ప్రేక్షకులకు షోపై కాస్త ఇంట్రెస్ట్ ను తగ్గించాయనే చెప్పాలి. ప్రోమోలతో సహా అందరూ ఆతృతగా చూసే సండే ఎలిమినేషన్ లో ఎవరు బయటకు వెళుతున్నారు అనే విషయాలను లీకు రాయుళ్లు ముందుగానే సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశారు. ఈ విషయంపై ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా లీకులను మాత్రం ఆపలేకపోయారు.

Read Also : విశ్వక్ సేన్ కిల్లర్ యాటిట్యూడ్ లుక్… పిక్ వైరల్

అందుకే ఈసారి “బిగ్ బాస్” లీకు రాయుళ్లకు చెక్ పెట్టడానికి పక్కా ప్రణాళికతో వస్తున్నాడట. అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించే వవ షోకు సంబంధించి సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారట. ఎలిమినేట్ చేసే వ్యక్తి గురించి సీక్రెట్ గా ఉంచడానికి ప్రత్యేకంగా ఓ టీమ్ ను తయారు చేస్తున్నారట. మరి ఈసారి ఎంతవరకు లీకులకు బ్రేక్ చేస్తారో చూడాలి. కాగా ఐదవ సీజన్ కు హోస్ట్ గా రానా వ్యవహరించనున్నాడు అనే వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్, నాని కూడా ఈ షో ద్వారా బుల్లితెరపై వ్యాఖ్యలుగా కన్పించిన విషయం తెలిసిందే.

Exit mobile version