Site icon NTV Telugu

Sritej Health Bulletin: శ్రీతేజ్ హెల్త్ అప్డేట్.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Srritej

Srritej

పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ ఆస్పత్రి వైద్యులు తాజాగా విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ హెల్త్‌ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు.

Game Changer: టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ టైం.. గేమ్ ‘ఛేంజింగ్’ ఈవెంట్ కోసం రెడీ!

శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నాడని, వెంటిలేటర్ సాయం లేకుండా ఆక్సిజన్ తీసుకుంటున్నాడని వెల్లడించారు. అంతేకాక శ్రీ తేజ్ ఫీడింగ్ కూడా సక్రమంగా తీసుకుంటున్నాడని వెల్లడించారు. న్యూరాలజీ కండీషన్ స్థిరంగా ఉందని శ్రీ తేజ్ వైద్యులు. డిసెంబర్ 4న రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌‌రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి (35) అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం విధితమే. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు.

Exit mobile version