సౌత్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని తాజా పిక్ ఒకటి వైరల్ గా మారింది. ఆ పిక్ లో సమ్మర్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఒక తోటలో సమంత కూర్చుని ఉండగా… ఆ పిక్ లో చెట్టుకు వేలాడుతున్న మామిడికాయ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. వైట్ డ్రెస్ లో సమంత షేర్ చేసిన ఈ లేటెస్ట్ పిక్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కాగా సామ్ గత కొన్ని రోజులుగా “ఫ్యామిలీ మ్యాన్-2” కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ తో మొదలైన వివాదం ఇంకా ముగియలేదు. తమిళులను భారత వ్యతిరేకులుగా ఇందులో చూపించారని కామెంట్స్ చేస్తున్న వారికి క్లారిటీ ఇవ్వాలనే రీజన్ తో మేకర్స్ ఇటీవలే ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ హిందీ వెర్షన్ ను విడుదల చేశారు. ఈ సీరిస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కానీ తమిళనాడులో మాత్రం ఇంకా ఈ వెబ్ సీరిస్ పై కొందరు గుర్రుగానే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆదివారం బోయ్ కాట్ అమెజాన్, బ్యాన్ ఫ్యామిలీ మ్యాన్ 2, ఫ్యామిలీ మ్యాన్ 2 అగైనెస్ట్ తమిళ్స్ అంటూ కొందరు హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో హంగామా చేశారు.
సమ్మర్ వైబ్స్… సమంత లేటెస్ట్ పిక్ వైరల్
![Latest click of actress Samantha Goes Viral](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2021/06/Sam-1024x768.jpg)