NTV Telugu Site icon

చరణ్, శంకర్ ప్రాజెక్ట్ కోసం ఆ ఇద్దరు భామలు ?

Latest Buzz about Heroine in Charan and Shankar Project

సెన్సేషన్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో సినిమా రానున్న విషయం తెలిసిందే. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. రాజకీయ నేపథ్యంలో రామ్ చరణ్- శంక‌ర్ సినిమా ఉంటుంద‌ని ప్రచారం న‌డుస్తుంది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాపై పలు రూమర్లు చక్కర్లు కొడుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం నాలుగు భాషల నుంచి నలుగురు స్టార్ హీరోలను తీసుకోనున్నారని, తెలుగు వెర్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కన్నడంలో ఉపేంద్ర, తమిళంలో విజయ్ సేతుపతి, హిందీ వెర్షన్ లో సల్మాన్ ఖాన్ నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ల జాబితాలో ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లు విన్పిస్తున్నాయి. అయితే ఆ ఇద్దరూ కూడా బాలీవుడ్ భామలే కావడం విశేషం. మొదటగా అలియా భట్ హీరోయిన్ గా నటించనుంది అని వార్తలు రాగా.. ఇప్పుడు కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనుందనే టాక్ నడుస్తోంది. అయితే మెగా అభిమానులు మాత్రం వీరిద్దరిలో ఎవరు ఓకే అయినా పర్లేదు అంటున్నారు. చూడాలి మరి ఈ చిత్రంలో హీరోయిన్ అవకాశం ఎవరిని వరిస్తుందో…!