సూపర్ స్టార్ రజనీకాంత్ “జైలర్” సినిమాతో అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చారు. ఆ సినిమా రజనీ కెరీర్ లోనే భారీగా కలెక్షన్స్ సాధించింది. జైలర్ తరువాత రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ లో లాల్ సలామ్ మూవీలో నటించారు.లాల్ సలామ్ సినిమాలో రజనీకాంత్ ఎక్కువ నిడివి కలిగిన అతిథి పాత్రలో కనిపించారు..ఈ సినిమా స్పోర్ట్స్ బేస్‌డ్ యాక్షన్ సినిమాగా తెరకెక్కింది.ఈ మూవీలో విష్ణువిశాల్ మరియు విక్రాంత్ హీరోలుగా నటించారు. దాదాపు ఎనభై కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరణ్ ఈ సినిమాను నిర్మించారు.
ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది.. పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజైన ఈ మూవీ అన్ని భాషల్లో కలిపి 30 కోట్ల లోపే వసూళ్లను రాబట్టి రజనీకాంత్ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.మూవీ థియేటర్లలో రిలీజై మూడు నెలలు గడుస్తున్న ఇప్పటివరకు ఓటీటీలో రిలీజ్ రాలేదు. థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలోకి రావడం కష్టమేనని వార్తలు వినిపించాయి .అయితే ఈ మూవీ సన్ నెక్స్ట్ ద్వారా ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. మే సెకండ్ వీక్ లేదా మూడో వారంలో లాల్ సలామ్ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే లాల్ సలామ్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
