NTV Telugu Site icon

సూపర్ స్టార్ తో మంచు లక్ష్మీ సెల్ఫీ… పిక్ వైరల్

Lakshmi Manchu Selfi with Superstar Rajinikanth in Hyderabad

సూపర్ స్టార్ రజినీకాంత్ తో మంచు లక్ష్మి దిగిన సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మే 12 న లక్ష్మి మంచు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ లో పంచుకుంది. ఈ పిక్ చూస్తుంటే ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ ముగిసిన తరువాత రజనీకాంత్ హైదరాబాద్ లోని తన స్నేహితుడు మోహన్ బాబు ఇంటికి వెళ్లినట్లు కన్పిస్తోంది. గత కొద్దిరోజులుగా ‘అన్నాత్తే’ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ ఏప్రిల్ 12న హైదరాబాద్‌లో ‘అన్నాత్తే’ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్న 35 రోజుల షెడ్యూల్ నేటితో పూర్తయ్యింది. తరువాత కోల్‌కతాలో కూడా ఒక చిన్న షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక హైదరాబాద్ లో షూటింగ్ పూర్తవ్వడంతో రజనీకాంత్ ఈ రోజు తిరిగి చెన్నైకి వెళ్లిపోయారు. కాగా రజనీకాంత్, దర్శకుడు సిరుతై శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అన్నాత్తే’. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ‘అన్నాత్తే’ నవంబర్ 4 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.