‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రముఖ లేడీ డైరెక్టర్ సుధా కొంగర. ఈ మహిళా దర్శకురాలు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఓ సినిమా చేయనుందని గతకొద్ది రోజులుగా వార్తలు విన్పిస్తున్నాయి. తాజాగా విన్పిస్తున్న బజ్ ప్రకారం సుధా కొంగర ప్రభాస్‌కు ఒక కథను వివరించారట. ఇటీవలే ప్రభాస్ తో సుధా సమావేశమయ్యారట. ఓ సోషల్ డ్రామాను ఆమె ప్రభాస్ కు చెప్పారట. స్టోరీ లైన్ కు ప్రభాస్ కు ఇంప్రెస్ అయ్యారట. దాంతో ఆమెను ఫైనల్ డ్రాఫ్ట్ తో వచ్చి కలవమని చెప్పాడట ప్రభాస్. బౌండ్ స్క్రిప్ట్ విన్న తరువాతే సుధా ప్రాజెక్ట్ పై ప్రభాస్ తుది నిర్ణయం తీసుకుంటారట. మరోవైపు ప్రభాస్ 2023 వరకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉంటారు. 2022 మొత్తాన్ని నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కే కేటాయించాడు. సుధా కొంగరతో ప్రభాస్ ప్రాజెక్ట్ పట్టాలెక్కేది 2023 తరువాతే అన్నమాట.
ప్రభాస్ కు కథను చెప్పిన ప్రముఖ లేడీ డైరెక్టర్
