NTV Telugu Site icon

Raj Tarun – Malvi : టాలీవుడ్ హిస్టరీ లోనే ఫస్ట్ టైం.. ఈవెంట్లో లేడీ బౌన్సర్లు!!

Malvi Malhotra

Malvi Malhotra

Lady Bouncers first time in tollywood for Malvi Malhotra: టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. అదేమిటంటే ఇప్పటివరకు కొన్ని వందల సినిమా ఈవెంట్లు జరిగాయి కానీ ఒక్క ఈవెంట్ కి కూడా లేడీ బౌన్సర్ హాజరు కాలేదు. రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన తమన్నా బబ్లీ బౌన్సర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో కొంతమంది లేడీ బౌన్సర్లను తీసుకువచ్చారు. కానీ నిజానికి లేడీ బౌన్సర్లను తీసుకువచ్చే అవసరం ఇప్పటివరకు పడలేదు. అయితే రాజ్ తరుణ్- లావణ్య- మాల్వి మల్హోత్రా వివాదం నేపథ్యంలో లేడీ బౌన్సర్ల అవసరం కూడా పడింది.

Lavanya: మొగుడితో సంసారం చేసినట్లు రాజ్ తో మాల్వీ కలిసి ఎందుకు ఉంటుంది?

తిరగబడరా సామి అనే సినిమా ఆగస్టు రెండో తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కోసం రాజ్ తరుణ్ మాల్వి వస్తున్నారనే విషయం తెలిసి లావణ్య కూడా ప్రసాద్ ల్యాబ్ కు చేరుకుంటున్న విషయం నిర్వాహకులకు ముందే తెలిసింది. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడమే కాక రాజ్ తరుణ్ కోసం నలుగురు బౌన్సర్లతో పాటు హీరోయిన్ కోసం ఇద్దరు లేడీ బౌన్సర్లను కూడా ఏర్పాటు చేశారు. బహుశా టాలీవుడ్ లో లేడీ బౌన్సర్ల వినియోగం అది కూడా ప్రెస్ మీట్స్ కోసం ఇదే మొదటి సారేమో అని చర్చ టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది.

Show comments