Site icon NTV Telugu

Kubera : ‘కుబేర’ తో ఎన్నాళ్లకు హౌస్‌ఫుల్ బోర్డులు.. మళ్లీ జోష్‌లో ఇండస్ట్రీ

Kubera Full House

Kubera Full House

ప్రజంట్ థియేట‌ర్లకు వ‌చ్చే జ‌నం రోజు రోజుకూ త‌గ్గిపోతుండటంతో ఇండస్ట్రీ సరిస్థితి ధారుణంగా తయ్యారైంది.పెద్ద సినిమాలకు ఓపెనింగ్ నామమాత్రంగా మారిపోతుండటమే కాకుండా, చిన్న సినిమాలైతే ప్రేక్షకుల దృష్టికి కూడా రాలేకపోతున్నాయి. ఒకప్పుడు హిట్‌ల జోరుతో నడిచిన సమ్మర్ సీజన్ ఈసారి బాగా నిరాశపరిచింది. నాని ‘హిట్-3’ తర్వాత ఒక నెల పాటు బాక్సాఫీస్ ఖాళీగా కనిపించింది. జూన్ మీద కొంత ఆశ పెట్టుకున్న ఇండస్ట్రీకి, మొదటి వారంలో ‘థగ్ లైఫ్’ డిజాస్టర్ కావడం, తర్వాత రావలసిన ‘హరిహర వీరమల్లు’ వాయిదా పడటం.. కొంత నిరాశ కలిగించాయి. ఇలాంటి కష్టకాలంలో, ప్రేక్షకులకి కావాల్సిన కంటెంట్‌తో దర్శకుడు శేఖర్ కమ్ముల మళ్లీ థియేటర్లను ఊపిరి పోశారు.

Also Read : Ananya Nagalla : తన బ్రేకప్ స్టోరీ పంచుకున్న అనన్య నాగళ్ల..

ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘కుబేర’ సినిమా విడుదలైన రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. రిలీజ్‌కి ముందు అంచనాల ప్రకారమే.. రిలీజ్‌ తర్వాత కూడా విశేషమైన స్పందన వచ్చింది. ప్రేక్షకుల మౌత్ టాక్, రివ్యూలు అని పాజిటివ్‌గా రావడంతో ఈ రోజు థియేటర్ల ముందు మళ్లీ హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆన్‌లైన్ బుకింగ్స్ ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి, కొన్నిచోట్ల షోలు పూర్తి స్థాయిలో సేల్ అవుతున్నాయి. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే.. ఈ సినిమా ధనుష్ కెరీర్‌లోనే ఒక పెద్ద హిట్‌గా నిలవబోతుందని స్పష్టంగా కనిపిస్తోంది. నాగార్జున కూ కూడా ఇది ఓ మంచి కమర్షియల్ హిట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మొత్తానికి ఇండస్ట్రీ మొత్తం ప్రస్తుతం ‘కుబేర’ విజయంతో ఊపిరి పీలుస్తుంది. ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాలకు ఆదరణ చూపిస్తారన్న దానికి ఇది మరో ఉదాహరణ.

Exit mobile version