Site icon NTV Telugu

తేజ ఆఫర్ ను తిరస్కరించిన ‘ఉప్పెన’ బ్యూటీ ?

Kriti Shetty refused Teja Movie Offer

‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్ లో మొదటి చిత్రంతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. దీంతో ఈ క్యూట్ బేబీకి ఆఫర్ల వెల్లువ మొదలైంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే అది కృతి శేట్టినే. ప్రస్తుతం కృతి చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. కృతి శెట్టి ‘శ్యామ్ సింగ్ రాయ్’లో నానితో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. సుధీర్ బాబుతో కలిసి రొమాంటిక్ డ్రామా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లో కూడా నటిస్తోంది. అయితే తాజా అప్డేట్ ఏంటంటే… ప్రముఖ డైరెక్టర్ తేజ ఆఫర్ ను తిరస్కరించిందట ఈ బ్యూటీ. అభిరామ్ దగ్గుబాటి వెండితెర అరంగ్రేటం చేయనున్న చిత్రానికి తేజ దర్శకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మేకర్స్ ఈ మూవీ కోసం కృతిని సంప్రదించగా… ఆమె వారి ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట. ఇక దగ్గుబాటి అభిరామ్ కోసం తేజ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించనున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించబడుతుంది.

Exit mobile version