Site icon NTV Telugu

Krithi Shetty : ఛాన్స్‌ల కోసం గ్లామర్ డోస్ పెంచేసిన బేబ్బమ్మ ..

Krethi Shety

Krethi Shety

తొలి సినిమాతోనే పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి.. కానీ ఈ అదృష్టం అమ్మడుకి ఎక్కువ కాలం నిలవలేదు. శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు వంటి సినిమాల్లో కృతి ఓకే అనిపించుకున్నా.. ఆ తర్వాత వరుసగా చేసిన సినిమాలు మాత్రం ఆమెను ఓవర్ నైట్ స్టార్ నుంచి ఓవర్ డౌన్ అయిన స్టార్‌కి మార్చేశాయి. ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కాకపోవడంతో ఆమెపై ఆసక్తి తగ్గిపోయింది.

Also Read : HHVM : పార్ట్ 2 పై వీరమల్లు టీమ్ క్లారిటీ..

చివరగా.. ‘మనమే’  చిత్రతో కూడా నిలవలేకపోయింది. దీంతో తెలుగులో అవకాశాలు తగ్గడంతో తమిళ సినిమాల వైపు దృష్టి పెట్టిన కృతి. ప్రస్తుతం అక్కడ ఎల్.ఐ.కె, జినీ సినిమాలు చేస్తుంది. ఈ రెండు సినిమాల పై ఆమె చాలా హోప్స్ పెట్టుకుంది. టాలీవుడ్‌లో మళ్లీ తన మార్క్ చూపించాలంటే, ఈ సినిమాల సక్సెస్ చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్లు న్యూ ఫేస్‌లను ఎక్కువగా ఇంపార్టేన్స్ ఇస్తున్న సమయంలో, కృతి శెట్టి మళ్లీ గట్టిగా రీ ఎంట్రీ ఇవ్వాలంటే, కంటెంట్ బేస్డ్ సినిమా లేదా.. పవర్‌ఫుల్ పాత్రతో రీబౌండ్ కావాల్సిందే. తమిళ సినిమాల్లోని ఆమె పనితీరు బాగుంటే, టాలీవుడ్‌కి తిరిగి రావడం పెద్ద విషయమేమీ కాదు.అంటే కోలీవుడ్‌లో ఆమె చేసిన ఈ కొత్త ప్రయత్నం ఆమె ఫేట్‌ని మళ్లీ ఎత్తుకు తీసుకెళ్తుందా లేదా అన్నది.

అందుకే ఇంతకు ముందు గ్లామర్ షో విషయంలో రిజర్వ్డ్‌గా ఉండే కృతి.. ఇప్పుడు మాత్రం ఫుల్ రెచ్చిపోయి ఫోటోషూట్‌లలో కొత్త లుక్‌లతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సినిమాల ఛాన్సులు తగ్గినా, అభిమానుల్లోనూ, ట్రెండ్‌లోనూ తన ప్రెజెన్స్‌ని కొనసాగించేందుకు ఆమె ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.

Exit mobile version