Site icon NTV Telugu

Krithi Shetty: హీరోయిన్ను భయపెట్టిన ఆత్మ.. చివరికి ఏమైందంటే!

Kreethi

Kreethi

Krithi Shetty: యంగ్ హీరోయిన్ కృతి శెట్టి తాజాగా తనకు ఎదురైన ఓ వింత అనుభవాన్ని పంచుకుంది. తాను నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు రోజు రాత్రి, తన హోటల్ రూంలో ఒక ఆత్మను చూశానని తెలిపింది. తమిళ నటుడు కార్తీ హీరోగా, నలన్ కుమారస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘వా వాత్తియార్’ సినిమాలో కృతి నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె ఆత్మలతో మాట్లాడే ఒక జిప్సీ యువతి రోల్ ను పోషిస్తుంది. ఈ పాత్ర గురించి మాట్లాడుతూ, ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందు రోజు రాత్రి నాకు ఓ వింత అనుభవం ఎదురైంది.. మా అమ్మతో కలిసి నేను హోటల్ గదిలో ఉన్న సమయంలో ఒక ఆత్మ రూపం కనిపించింది.. మేం లైట్ వేయగానే పెద్దగా శబ్దం వచ్చి అది మాయమైంది అని బేబమ్మ పేర్కొనింది.

Read Also: Messi vs CM Revanth : మెస్సీ, సీఎం రేవంత్ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న ఉప్పల్

అయితే, ఆ ఆత్మ నాకు సహాయం చేయడానికి వచ్చిందా లేక పాత్ర కోసం నేను చేస్తున్న ప్రాక్టీస్ వల్ల వచ్చిందో తెలియదని కృతి శెట్టి వెల్లడించింది. కాగా, తనకు మొదటి నుంచి ఆత్మలపై నమ్మకం ఉంది.. ఎందుకంటే, నేను తుళు సంప్రదాయానికి చెందిన వ్యక్తిని.. మేము మా పూర్వీకులను దేవతలుగా కొలుస్తాం.. వారు ఎప్పుడూ మమ్మల్ని రక్షిస్తుంటారని నమ్ముతాం.. ఇప్పుడు ఈ సంఘటనతో ఆ నమ్మకం మరింత బలపడిందని తెలియజేసింది. ఈ అనుభవం వల్ల చిత్రంలో తాను పోషిస్తున్న పాత్రపై మరింత నమ్మకం కలిగింది, నటనలో తనకు బాగా ఉపయోగపడిందని కృతి అన్నారు. ఈ సినిమాలో కార్తీ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా, సత్యరాజ్, రాజ్ కిరణ్, ఆనంద్ రాజ్, కరుణాకరన్ లాంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version