Site icon NTV Telugu

Krithi Shetty: తెలుగొద్దు.. తమిళమే ముద్దు!

Krithi

Krithi

ఉప్పెనతో ఉప్పెనలా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎగసిపడ్డ సోయగం కృతి శెట్టి. ఫస్ట్ సినిమాతోనే వంద కోట్ల వసూళ్లను చూసిన అమ్మడి క్రేజ్.. ఓవర్ నైట్ యూత్ క్రష్ బ్యూటీగా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు హ్యాట్రిక్ హిట్స్‌తో చిన్న వయస్సులోనే స్టార్డ్ డమ్ చూసింది. కానీ ఎంత ఫాస్ట్‌గా పీక్స్ చూసిందో.. అంతే ఫాస్ట్ గా డౌన్ ఫాల్ అయ్యింది కృతి. రామ్ పోతినేని ది వారియర్, నితిన్ మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాల ప్లాప్స్‌తో బేబమ్మ కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. నాగ చైతన్య కస్టడీతో తనను ఆదుకుంటాడేమో అనుకుంది కానీ.. అది అవ్వదమ్మ అని ఆడియన్స్ డిసైడ్ చేశారు. శర్వానంద్ ను నమ్ముకున్నా సేమ్ సిచుయేషన్. ఇక కెరీర్ ఎటు వెళుతుందా అన్న టైంలో మలయాళ మూవీ ఏఆర్ఎం ఆమెను ప్లాపుల నుండి గట్టెక్కించింది.

Naga Vamsi: హరిహర వీరమల్లు వస్తే మేము రాము!

ఉప్పెనలాగా మలయాళంలో ఫస్ట్ మూవీతోనే వంద కోట్లను చూసింది భామ. ఇక టాలీవుడ్ అచ్చి రాలేదనుకుందో.. లేక ఆఫర్లు రావట్లేదో తెలియదు కానీ.. ఫుల్ గా పొరుగు ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తోంది. కృతి చేతిలో ప్రజెంట్ మూడు తమిళ ప్రాజెక్టులున్నాయి. కార్తీ వా వాతియార్, ప్రదీప్ రంగనాథ్ లవ్ ఇన్య్సురెన్స్ కంపెనీ, జయం రవితో జీని చేస్తోంది. ఈ మూడు కూడా కోలీవుడ్ సినిమాలే. పొరుగు ఇండస్ట్రీలో ఆఫర్లు కొల్లగొడుతూ.. తెలుగు సినిమా అప్డేట్స్ లేకపోవడం చూస్తుంటే.. పూజా, శృతిలా టాలీవుడ్‌కు దూరంగా జరగబోతుందా అన్న డౌట్ కలుగకమానదు.

Exit mobile version