Site icon NTV Telugu

Krithi Shetty: బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకోబోతున్న కృతి శెట్టి

Kruthi Shety

Kruthi Shety

అనతి కాలం లోనే దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కృతి శెట్టి. మొదటి చిత్రం ‘ఉప్పెన’ తోనే మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. తమిళ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి మార్కేట్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు తన టాలెంట్‌ని బాలీవుడ్ ప్రేక్షకుల ముందు కూడా పరీక్షించుకోబోతుంది. తన చక్కటి నటనతో పాటు అందం, సహజమైన ఎక్స్ప్రెషన్స్‌‌తో కృతి దక్షిణాదిలో బలమైన ఫ్యాన్‌బేస్‌ని సంపాదించింది. ఇప్పుడు ఆ క్రేజ్‌ని హిందీ ఆడియన్స్ ముందు కూడా నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం, కృతి శెట్టి బాలీవుడ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా కుమారుడు యశ్వర్ధన్ అహుజా హీరోగా నటించనున్నాడ‌ని టాక్. ఓ టాప్ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాను నిర్మించనుంద‌ని, దీనికి సాజిద్ ఖాన్ దర్శకత్వం వహించే అవకాశాలు బలంగా వినిపిస్తోంది. అంతేకాదు, దక్షిణాదిలో విజయవంతమైన ఓ సినిమా రీమేక్‌గా ఈ కథను తెరకెక్కించనున్నారని సమాచారం. పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి.

ఇకపో‌తే, ప్రస్తుతం కృతి ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే సినిమాతో బిజీగా ఉంది. బాలీవుడ్ డెబ్యూ కుదిరితే, దక్షిణాది‌తో పాటు ఉత్తరాదిలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవచ్చ‌నే ఉత్సాహంతో కృతి శెట్టి ముందుకు సాగుతోంది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లుగా ఉన్న త్రిష, నయనతార, సమంత లాగా బాలీవుడ్‌లో కూడా తన ప్రతిభను చాటుకోవాలని కృతి కూడా అత్రుతగా ఉంద‌ట. కానీ ఈ ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ అవ్వాల్సి ఉంది, కృతి శెట్టి‌కి బాలీవుడ్ ఎంట్రీ ఎంత వరకు టర్నింగ్ పాయింట్ అవుతుంది చూడాలి.

Exit mobile version