NTV Telugu Site icon

DGL : నాలుగేళ్లకు సినిమా అనౌన్స్ చేసిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ డైరెక్టర్

Dgl

Dgl

Kranthi Madhav’s New Fil Titled Peculiarly DGL: ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా రిలీజ్ అయిన నాలుగేళ్లకు మరో సినిమా అనౌన్స్ చేశారు డైరెక్టర్ కె క్రాంతి మాధవ్. యూనిక్ అండ్ వైడ్ రేంజ్ ఎమోషనన్స్ వున్న మూవీస్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆయన ఆర్తీ క్రియేటివ్ టీమ్ బ్యానర్‌పై గంటా కార్తీక్ రెడ్డి నిర్మించనున్న తన న్యూ ప్రాజెక్ట్‌ను ఇప్పుడు అనౌన్స్ చేశారు. క్రాంతి మాధవ్ తన లేటెస్ట్ మూవీ కోసం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌ని సిద్ధం చేశారు, ఇది వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రెడీ చేసిన కథ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి DGL అనే ఆసక్తికరమైన టైటిల్‌ పెట్టారు. టైటిల్ పోస్టర్‌లో హీరో తన టీ-షర్ట్‌ని వెనుక నుంచి లిఫ్ట్ చేసి డిఫరెంట్ ఫోజ్ లో కనిపించారు.

Telusu Kada: మంచి స్పీడుమీదున్నాం.. తెలుసు కదా!!

కాజీపేట జంక్షన్‌లోని రైల్వే ట్రాక్‌పై నిలబడి ఉండగా, అతని చుట్టూ వివిధ ట్రాక్‌లపై రైళ్లు వెళుతున్నాయి. పోస్టర్‌లో జర్నీ బిగిన్స్ అని రాసుంది. టీమ్ విడుదల చేసిన మరో పోస్టర్‌లో స్నేహితుల గ్యాంగ్ రైల్వే బ్రిడ్జి పైన ఎంజాయ్ చేస్తున్నట్టు ప్రజెంట్ చేస్తోంది. రెండు పోస్టర్‌లు క్యురియాసిటీని పెంచాయి. DGL సినిమా షూటింగ్ నవంబర్ 2024లో ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.జ్ఞాన శేఖర్ వీఎస్ కెమెరా మ్యాన్. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ క్లాసిక్ తర్వాత క్రాంతి మాధవ్, జ్ఞాన శేఖర్ VS కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన తారాగణంతో పాటు ఇతర టెక్నీషియన్స్‌ల వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.