జాతీయ అవార్డు గ్రహీత సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ ‘కోతికొమ్మచ్చి’. రియల్ స్టార్ స్వర్గీయ శ్రీహరి తనయుడు మేఘాంశ్ తో పాటు సతీశ్ వేగేశ్న కుమారుడు సమీర్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. రిద్దికుమార్, మేఘా చౌదరి హీరోయిన్లు. ఈ చిత్రాన్ని లక్ష ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో ఎంఎల్‌వి సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, నరేష్ విజయ కృష్ణ, మణి చందన, అన్నపూర్ణమ్మ, షిజు, మరియు శివనారాయణ సహాయక పాత్రల్లో నటించారు. ‘కోతి కొమ్మచ్చి’కి భాను కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. తాజాగా ఈ చిత్రంలోని ‘కోతికొమ్మచ్చి’ థీమ్ సాంగ్ ను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేశారు. ఈ పాటను దివ్య ఐశ్వర్య, శ్రీ శ్రీత తుమ్ము మరియు ఎస్.జె.కైవిల్యలతో కలిసి అనుప్ రూబెన్స్ పాడారు. సాహిత్యాన్ని శ్రీ మణి రచించగా, అనుప్ రూబెన్స్ వినోదాత్మకంగా ట్యూన్ కంపోజ్ చేశారు.
ఆకట్టుకుంటున్న ‘కోతి కొమ్మచ్చి’ థీమ్ సాంగ్
