బాలీవుడ్ రీమేక్ ల వెంట పడుతోంది. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలు మొదలు కొరియన్ సినిమాల దాకా దేన్నీ వదలటం లేదు. తాజాగా బీ-టౌన్ బిగ్ ప్రొడ్యూసర్ మురద్ ఖేతానీ సౌత్ కొరియన్ కల్ట్ మూవీ ‘మిరాకిల్ ఇన్ సెల్ నంబర్ 7’ హక్కుల్ని కొనుగోలు చేశాడు. త్వరలోనే ఆయన రీమేక్ వర్షన్ ని సెట్స్ మీదకి తీసుకెళతాడట. ముందుగా దర్శకుడ్ని ఎంపిక చేశాక బాలీవుడ్ ఏ-లిస్ట్ యాక్టర్స్ కి కథ వినిపించనున్నారని సమాచారం. ముంబై టాప్ స్టార్స్ లో ఎవరు ఈ రీమేక్ లో నటించటానికి ముందుకు వస్తాడో చూడాలి…
Read Also : డాక్టర్స్ కు సెల్యూట్ చేస్తున్న స్టార్ హీరోలు
‘మిరాకిల్ ఇన్ సెల్ నంబర్ 7’ సినిమా ఓ మెంటల్లీ ఛాలెంజ్డ్ ప్రిజినర్ కథ. అతడ్ని చేయని నేరానికి జైల్లో పెడతారు. 9 ఏళ్ల పాపని రేప్ చేసి, చంపేశాడని పోలీసులు బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేస్తారు. కానీ, అతను జైల్లోని ఇతర ఖైదీలతో స్నేహం చేసి, వారి సాయంతో, తన కూతుర్ని సెల్ లోకి అక్రమంగా రప్పించుకుంటాడు. తరువాత ఆమె ప్రయత్నంతో ఆ మెంటల్లీ ఛాలెంజ్డ్ విక్టిమ్ ఎలా బయటపడ్డాడన్నదే కథ!
‘మిరాకిల్ ఇన్ సెల్ నంబర్ 7’ నిర్మించబోతోన్న మురద్ ఖాతానీ లాస్ట్ మూవీ ‘కబీర్ సింగ్’. అది కూడా రీమేకే! తెలుగు చిత్రం ‘అర్జున్ రెడ్డి’కి బాలీవుడ్ వర్షన్ రూపొందించిన బీ-టౌన్ ప్రొడ్యూసర్స్ భారీ లాభాల్ని ఖాతాలో వేసుకున్నాడు…
