‘ఆర్ఆర్ఆర్’ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్ట్ ను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. తాత్కాలికంగా ఎన్‌టిఆర్ 30 పేరుతో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్తుందని భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు కొరటాల శివ… ఎన్టీఆర్ కోసం ఒక పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాను రాశారట. మాములుగా కొరటాల శివ చిత్రాల్లో సోషల్ మెసేజ్ తో పాటు కమర్షియల్ అంశాలు కూడా మిళితమై ఉంటాయి. ఎన్టీఆర్30 కోసం కూడా కొరటాల అదే శైలిని అనుసరిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయం నిజమైతే ఎన్టీఆర్ పొలిటికల్ డ్రామాలో నటించడం అదే మొదటిసారి అవుతుంది. అంతేకాదు అంచనాలు కూడా భారీ రేంజ్ లో ఉంటాయి. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఎన్టీఆర్30లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి.
ఎన్టీఆర్ కోసం కొరటాల పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా ?
