Site icon NTV Telugu

Devara 2: వర వీర విహారమే పార్ట్ 2 .. హైపెక్కించేస్తున్న కొరటాల

Koratala Siva

Koratala Siva

Koratala Siva Hypes Devara 2: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా మరిన్ని వసూళ్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇక మొదటి భాగంలోనే రెండో భాగం మీద భలే అంచనాలు పెంచేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ కొరటాల శివ. ఇప్పుడు తాజాగా ఆయన రెండో భాగం గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా అంతా చేయడం ఒక ఎత్తు అయితే ఈ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేయడం, తరువాతి భాగం విషయంలో బాధ్యత పెరుగుతుంది కదా అని ఇంటర్వ్యూయర్ అడిగితే కొరటాల శివ దేవర 1 అనేది ఒక బిగినింగ్ అంతే అని అన్నారు.

Sabari : ఓటీటీలోకి వరలక్ష్మీ శరత్ కుమార్‌ ‘శబరి’.. ఎక్కడ ఎప్పుడు చూడాలంటే?

ఇది చాలా పెద్ద కథ. చాలా ప్రశ్నలు ఆన్సర్ చేయాలి, చాలా పాత్రలు వేరే షేప్ తీసుకుంటాయి అని ఆయన అన్నారు. వర అనే వాడు ఇంత ధైర్యవంతుడు అని ఇంకా సినిమాలో వేరే పాత్రలకు తెలియదు, మనకి తెలిసింది కానీ. ఆ డ్రామా ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీ. వర ఆడే ఆట దేవర 2లో చాలా కొత్తగా ఉంటుందని అన్నారు. వర వీర విహారమే పార్ట్ 2 అని అన్నారు. ఇక దేవర 2 విషయంలో రెస్పాన్సిబిలిటీ పెరిగింది. అన్ని రాష్ట్రాల నుంచి మాకు వచ్చిన ఫీడ్ బ్యాక్ చూస్తే చాలా బాధ్యతగా పని చేయాలి. వచ్చే ఏడాది పట్టాలు ఎక్కే అవకాశం ఉంది అని ఆయన అన్నారు.

Exit mobile version