Site icon NTV Telugu

Koratala Siva: నాకు సెంటిమెంట్స్ లేవు.. కొరటాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Koratala Siva Birthday Special Article

Koratala Siva Birthday Special Article

Koratala Siva Comments on Sentiments: తనకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవు అంటున్నారు కొరటాల శివ. అదేంటి అనుకుంటున్నారా? మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ‘దేవర’. అందుకే సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో ఇప్పుడు దేవర ట్రెండ్‌ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే.. ఈ నేపథ్యంలో దేవర సినిమా డైరెక్టర్ కొరటాల శివతో ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలో ఆయన కొన్ని విషయాలు పంచుకున్నారు. మీకు ఏమైనా సెంటిమెంట్స్ ఉన్నాయా? అని అడిగితే దానికి ఆయన స్పందిస్తూ తనకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవు అస్సలు ఏమీ లేవు జీరో అని పేర్కొన్నారు.

Koratala Siva Exclusive Interview : దేవర డైరెక్టర్‌ కొరటాల శివతో ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ

లక్ ఫ్యాక్టర్ ను గానీ ఏమైనా నమ్మడం లేదా అని అంటే నమ్మడం నమ్మక పోవడం పక్కన పెడితే నేను అసలు పట్టించుకోను. నేను మా పని చేశాం దాని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తామని అన్నారు. అయితే ఏవైనా అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఐదు గంటలకి అని కాకుండా ఐదు నాలుగు, ఆరు మూడు ఇలా సపరేటుగా ఎందుకు టైం మెన్షన్ చేస్తారు అని అడిగితే అది మార్కెటింగ్ టెక్నిక్ అని ఆయన చెప్పుకొచ్చారు. నాకు కూడా ఈ విషయం మీద ఆసక్తి ఉండేది ఒకసారి అడిగితే టోటల్ నైన్ వచ్చేలాగా కొంతమంది అడుగుతారు అని వాళ్ళు చెప్పారు అంటూ చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తానికి 9 కలిసి వచ్చింది కాబట్టి ఆ 9 టోటల్ వచ్చేలా అప్డేట్ టైం కూడా ప్లాన్ చేసి ఉండొచ్చని అన్నారు.

Exit mobile version