NTV Telugu Site icon

Konda Surekha Lawyer: నాగార్జునకు మద్దతు ఇచ్చే అందరిపై కేసులు వేస్తాం!

Nag

Nag

తెలంగాణలో సంచలనంగా మారిన మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై చేసిన తీవ్ర ఆరోపణలను ఖండిస్తూనే ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ అక్కినేని నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కొండా సురేఖపై అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాగార్జున వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టి, ఈ కేసులో నాగార్జునకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా నాగార్జున మీద కేసులు పెడతాం అంటున్నారు కొండా సురేఖ తరుపు లాయర్. అయిపోయిన విషయానికి నాగార్జున ఎందుకింత రాద్దాంతం చేస్తున్నాడు? అని ప్రశ్నించిన ఆయన నాగార్జునతో పాటు ఆయనకు మద్దతు ఇచ్చే అందరిపై కేసులు వేస్తాం అంటూ కామెంట్స్ చేశారు.

Sudheer Babu:’మా నాన్న సూపర్ హీరో’ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. అదే అసలు పాయింట్: హీరో సుధీర్ బాబు ఇంటర్వ్యూ
నేను పేరు ప్రస్తావించడం వలన నొచ్చుకుంటే నేను ఆ మాటలను వెనక్కు తీసుకుంటానని కొండా సురేఖ అన్నారు, అక్కడితో కేసు పరిష్కారం అయిపొయింది. అయితే కావాలనే డీవియేట్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి కేటీఆర్ అనే వ్యక్తి నాగార్జున ద్వారా కేసులు వేయిస్తున్నాడు అని మేము భావిస్తున్నాం అని కొండా సురేఖ లాయర్ పేర్కొన్నారు. మేము కూడా నాగార్జున, ఆయన వెనుక ఎవరు ఉన్నా వాళ్ళ మీద కేసు పెడతామని అన్నారు.

Show comments