ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర, ఓటీటీలో డివోషనల్ హారర్ థ్రిల్లర్ల హవా నడుస్తోంది. ‘కాంతార’ సృష్టించిన సెన్సేషన్ తర్వాత, ఇటీవల తెలుగులో వచ్చిన ‘శంభాల’ వరకు గ్రామీణ నేపథ్యం, దైవశక్తి, అడవుల మధ్య సాగే మిస్టరీ కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. జనాలు కూడా ఇలాంటి కథలకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇక ఇప్పుడు అదే కోవలోకి వచ్చే మరో కన్నడ సూపర్ హిట్ చిత్రం ‘కోన’ (Kona) ఓటీటీలోకి వచ్చేసింది. హారర్, సస్పెన్స్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమా గతేడాది థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.
Also Read : Rajinikanth: 5 రూపాయల పరోటా వెనుక సూపర్ స్టార్ కథ.. అభిమాని చేసిన పనికి రజినీ ఫిదా!
ఈ సినిమా కథ కర్ణాటకలోని కొల్లూరు అనే గ్రామం చుట్టూ తిరుగుతుంది. అక్కడ ఏటా ‘కోన’ అనే సంప్రదాయ ఆచారంలో భాగంగా గ్రామ రక్షణ కోసం ఒక దున్నపోతును బలి ఇస్తారు. అయితే, ఒక ఏడాది ఈ ఆచారం ఆగిపోవడంతో గ్రామంలో భయంకరమైన పరిస్థితులు మొదలవుతాయి. వరుస హత్యలు జరుగుతూ ఊరు వల్లకాడుగా మారుతుంది. అసలు ఈ హత్యలు చేస్తోంది ఎవరు? ఆగ్రహించిన శక్తులా లేక మనుషులా? అనే ఉత్కంఠభరిత అంశాలతో దర్శకుడు హరి కృష్ణ ఈ సినిమాను మలిచారు. కోమల్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో హారర్‌తో పాటు కామెడీ కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ మూవీ జీ5 (ZEE5) ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఓటీటీల్లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.
