Site icon NTV Telugu

Komali : నేను అది కాదు.. రూమర్లకు కౌంటర్ ఇచ్చిన కోమలి ప్రసాద్

Komali Prasad

Komali Prasad

తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకుని నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కోమలి ప్రసాద్. ఇటివల నాని ‘హిట్ 3’ మూవీలో ముఖ్యపాత్ర పోషించిన ఈ ముద్దుగుమ్మ, త్వరలో ‘శశివదనే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆమె గురించి కొన్ని అబద్దపు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. నటనకు గుడ్ బై చెబుతూ డాక్టర్ వృత్తిలోకి మారిపోయింది అని పుకార్లు వినిపించడంతో, కోమలి తానే స్వయంగా స్పందించారు..

Also Read : Prabas : అల్లు అర్జున్ – నీల్ ‘రావణం’ పై ఉన్న గాసిప్స్‌కి పుల్‌స్టాప్..

‘అందరికీ నమస్కారం. ఇటీవల నా గురించి డాక్టర్‌గా మారిపోయానని, నటనను పూర్తిగా వదిలేశానని కొన్ని అసత్య వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు ప్రముఖ మీడియా సంస్థలు కూడా దీనిని నిజమైందన్నట్లుగా ప్రచారం చేయడం బాధాకరం. ఇది పూర్తిగా అసత్యం. నిజానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ సినిమాల్లో నా స్థానం సంపాదించుకున్నాను. ఆ శివుని ఆశీస్సులతో నా నటనా ప్రస్థానం కొనసాగుతోంది. ఈ రకమైన రూమర్లు నాలోను, నా శ్రేయోభిలాషుల్లోను అనవసరంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకూడదని మనస్ఫూర్తి వేడుకుంటున్నాను. అందుకే ఈ పోస్ట్ ద్వారా నిజాన్ని మీ అందరితో పంచుకోవాలనుకున్నాను. నటన నాకు ఒక్క ఉద్యోగం మాత్రమే కాదు.. అది నా జీవన విధానం. చివరి శ్వాస వరకు నేను నటనతోనే జీవించాలనుకుంటున్నాను. ప్రస్తుతం కొత్త స్క్రిప్ట్‌లను ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నాను. త్వరలోనే మీ అందరినీ గర్వపడేలా చేసే కొత్త ప్రాజెక్ట్‌ల వివరాలతో మీ ముందుకు వస్తాను. నా ప్రయాణంలో వెన్నెముకలా నిలిచిన నా శ్రేయోభిలాషులకు, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని కోమలి ప్రసాద్ తేల్చిచెప్పింది.

Exit mobile version