Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా ప్రయోగాత్మక చిత్రాల హవా నడిచింది. అయితే ఇప్పుడు అక్కడి టాప్ స్టార్స్ అందరూ రూట్ మార్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించే పక్కా మాస్ కమర్షియల్ జోన్లోకి తిరిగి అడుగుపెడుతున్నారు. ప్రయోగాలతో పాటు ప్రేక్షకులకు కావాల్సిన అసలైన వినోదాన్ని పంచడమే లక్ష్యంగా క్రేజీ ప్రాజెక్టులతో లైన్ లోకి వస్తున్నారు. ఇటీవల సూర్య నటించిన ‘కరుప్పు’ సినిమాతోనే ఈ ట్రెండ్ మొదలైంది. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రంతో సూర్య తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో నిరూపించారు. ఈ సినిమా ఏకంగారూ రూ. 320 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది.
ఇదే జోష్‌ను ఫాలో అవుతూ విక్రమ్ తన తదుపరి చిత్రం ‘చీయాన్ 63’ ను లైన్ లో పెట్టారు. ఈ సినిమా కూడా మాస్ యాక్షన్ ఎలిమెంట్స్, ఫన్ కలిపిన ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 7 నుండి ప్రారంభం కానుంది. అలాగే వైవిధ్యమైన పాత్రలు చేసే ధనుష్ సైతం తన 55వ చిత్రం ‘D55’ కోసం కమర్షియల్ రూట్ ఎంచుకున్నారు. ఇదొక స్పై యాక్షన్ ఎంటర్టైనర్ అయినప్పటికీ ట్రీట్మెంట్ మాత్రం సాధారణ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా అన్ని వర్గాలకు నచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఉండబోతోందని సమాచారం. మరోవైపు టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ సైతం తన వింటేజ్ లుక్‌తో అలరించడానికి రెడీ అవుతున్నారు. ఆయన నటిస్తున్న ‘సేయోన్’ చిత్రం పక్కా రూరల్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. గతంలో శివకార్తికేయన్‌కు భారీ బ్లాక్‌బస్టర్స్ అందించిన ‘వరుత్తపడాత వాలిబర్ సంగం’, ‘రజినీ మురుగన్’ చిత్రాల తరహాలోనే మాస్ మూమెంట్స్‌తో ఈ సినిమా ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి కోలీవుడ్ స్టార్స్ అందరూ కమర్షియల్ జోన్లోకి రీ-ఎంట్రీ ఇస్తుండటంతో రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
- Peddi Inside Talk : 'పెద్ది' ఇన్ సైడ్ రిపోర్ట్.. ఫస్టాఫ్ అదిరింది..సెకండాఫ్ కొంచం?
- Peddi Breakeven Target : రామ్ చరణ్ 'పెద్ది' ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
- Blast Zone : అంచనాలు లేకుండా వచ్చి అదరగొట్టిన యాక్షన్ కింగ్ అర్జున్ 'బ్లాస్ట్'
- Buchi Babu: "నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా".. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
-
PM Svanidhi: 55 లక్షల మందికి గుడ్ న్యూస్.. పీఎం స్వనిధి పథకంలో మరిన్ని ప్రయోజనాలు..పూర్తి వివరాలు ఇవే!
-
Trump Tariff Cut: ట్రంప్ కీలక నిర్ణయం.. టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు.. ఈ రంగాలకు ప్రయోజనం
-
Horror Thriller OTT : మగాళ్లను వశం చేసుకునే మోహినీ పిశాచి… ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్
-
Operation Checkmate: ‘ఆపరేషన్ చెక్‌మేట్’లో 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు అరెస్ట్.. అమెరికా నుంచి బహిష్కరణకు సిద్ధం
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!