NTV Telugu Site icon

Kollywod: 2024లో గట్టిగా చేతులు కాల్చుకున్న కోలీవుడ్

Kollywood

Kollywood

2024లో ప్రయోగాల జోలికి పోయి.. వాతలు పెట్టుకుంది కోలీవుడ్. సీనియర్లు, జూనియర్ల నుండి 241 సినిమాలు విడుదలైతే.. అందులో 18 మాత్రమే హిట్టు బొమ్మలుగా నిలిచాయి. ఈ ఫెయిల్యూర్స్ చూసి విస్తుపోతున్నాయి సినీ వర్గాలు. రజనీ, విజయ్, సూర్య, విజయ్ సేతుపతి, ధనుష్ లాంటి స్టార్ల నుండి.. కుర్ర హీరోలు వరకు ఎన్నో చిత్రాలు వస్తే.. అందులో పాసైనవి కొన్ని మాత్రమే. ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాలు.. కంగువా, ఇండియన్ 2 ఇండస్ట్రీని దివాళా తీయించాయి. చిన్నా, పెద్ద సినిమాలకు 2024లో తమిళ ఇండస్ట్రీ పెట్టిన ఖర్చు 3 వేల కోట్ల రూపాయలని ఓ రిపోర్ట్ చెబుతుంది. ఇందులో కంగువ, ఇండియన్ 2, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం, వెట్టయాన్ చిత్రాలే థౌజండ్ క్రోర్ ఇన్వెస్ట్ చేశాయి. ఇక మిగిలిన సినిమాలకు అయిన పెట్టుబడి 2వేల కోట్లు. కానీ చెప్పుకోదగ్గ ప్రాఫిట్ చూడలేదు కోలీవుడ్. 3 వేల కోట్లకు గాను.. జస్ట్ 2 వేల కోట్లు మాత్రమే రాబట్టుకోగలిగింది. థౌజండ్ క్రోర్ నష్టాన్ని చవిచూసింది తమిళ చిత్ర పరిశ్రమ

Keerthy Suresh: దమ్ముంటే ప్రపోజ్ చేయమన్న కీర్తి సురేష్.. లవ్ స్టోరీ సినిమా కథలాగే ఉందే!

అజిత్, శింబు మినహా మిగిలిన బిగ్ స్టార్స్ 2024లో అభిమానులను పలకరించారు. లాల్ సలాం, వెట్టయాన్ తో రజనీకాంత్, ఇండియన్ 2తో కమల్ హాసన్, గోట్ తో విజయ్, కంగువతో సూర్య, మేరీ క్రిస్మస్, మహారాజా, విడుదల 2 చిత్రాలతో విజయ్ సేతుపతి, కెప్టెన్ మిల్లర్, రాయన్ లతో ధనుష్ మూవీ లవర్స్ కు హాయ్ చెప్పారు. కానీ వారిలో జస్ట్ సేఫైంది మాత్రం ఇళయదళపతి విజయ్, ధనుష్ లు మాత్రమే. గోట్ బ్రేక్ ఈవెన్ మూవీగా నిలిస్తే.. ధనుష్ రెండు సినిమాలు మంచి వసూళ్లు రాబట్టుకోగలిగాయి. మహారాజా భారీ హిట్టు మక్కల్ సెల్వన్ ఖాతాలో ఉన్నప్పటికీ.. మిగిలిన రెండు డిజాస్టర్స్ ఓ రిమార్క్ గా మిగిలిపోయాయి. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన కొన్ని సినిమాలు కోట్లు కుమ్మరించాయి. మహారాజాతో పాటు శివ కార్తీకేయన్ అమరన్, సుందరి సి దర్శకత్వంలో వచ్చిన హారర్ మూవీ అరణ్మనై 4, రబ్బర్ పందు, వాజై, రాయన్, స్టార్, లవర్ చిత్రాలు హిట్టు బొమ్మలుగా నిలిచాయి. భారీ నష్టాల్లో నుండి తమిళ చిత్ర పరిశ్రమను కాస్తో కూస్తో సేఫ్ జోన్ లో నిలబెట్టాయి ఈ సినిమాలు.

Show comments