యాక్షన్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగళ్లపాటి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. గతంలో ఆయన ‘చెక్’, ‘ఆర్ ఎక్స్ 100’ లాంటి ప్రయోగాత్మక సినిమాలకు పనిచేసిన.. ఈసారి పూర్తి స్థాయి హార్రర్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హై టెక్నికల్ వాల్యూస్, విజువల్ ఎఫెక్ట్స్‌తో టెక్నికల్‌గా చాలా రిచ్‌గా రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇక మొదటి నుంచి హార్రర్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన అంచనాలే ఉన్నాయి. ఫస్ట్ గ్లింప్స్‌తోనే ఆకట్టుకున్న ఈ సినిమా నుండి ఇప్పుడు మరో సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు..
మూవీ నుండి ఫస్ట్ సింగిల్‌ను ఆగస్టు 7న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. “ప్రేతభయం కంటే ముందు ప్రేమ పరిచయం చేస్తున్నాం”అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సాంగ్‌ను ప్రివ్యూలో పంచుకున్నారు. ఇది ఖచ్చితంగా ప్రేక్షకుల్లో ఇంకో లెవెల్ క్యూరియాసిటీ పెంచేలా ఉంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో ఎప్పుడూ బెస్ట్ ఇచ్చే సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు.ఇక ఇప్పటి వరకు రిలీజ్ డేట్ ప్రకటించకపోయినా, సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. మ్యూజికల్ ప్రమోషన్‌తో పాటు వరుసగా కొత్త అప్‌డేట్స్ ఇవ్వడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వీలైనంత త్వరలో థియేట్రికల్ రిలీజ్ డేట్ కూడా వెలువడే అవకాశం ఉంది.
In the world of horror and chills, is a beautiful love story ❤️#Kishkindhapuri first single #UndipoveNaathone out on August 7th ❤🔥@BSaiSreenivas @anupamahere @Koushik_psk @sahugarapati7 @chaitanmusic #ChinmaySalaskar @Shine_Screens @UrsVamsiShekar @JungleeMusicSTH pic.twitter.com/WWjmFk2s5c
— Shine Screens (@Shine_Screens) August 5, 2025
