గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి ఇటీవల ‘జూనియర్’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే మంచి టాక్ తెచ్చుకున్న కిరీటి నటన, డాన్సులు, యాక్షన్ సీన్లతో ఆకట్టుకున్నాడు. మేకింగ్ వీడియోల ద్వారా తన కష్టపడి పనిచేసే తత్వాన్ని మరోసారి నిరూపించాడు. రోప్ లేకుండా, డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం సాహసానికి నిదర్శనం.
Also Read : Niharika : విడాకుల నొప్పి నాకు మాత్రమే తెలుసు – నిహారిక ఓపెన్ టాక్
ఆర్థికంగా ఆయన స్ట్రాంగ్. అవసరమైతే తానే నిర్మాతగా మారగలడు. అంతటి సామర్థ్యం, తండ్రి మద్దతు.. అని తనకి ఉన్నాయి. తెలుగు, కన్నడ భాషల్లో కూడా కిరీటికి బేస్ ఉంది.. బళ్లారి వాస్తవ్యుడు కావడం వల్ల రెండు ఇండస్ట్రీస్‌లో కూడా అవకాశాల కోసం ఎక్కువగా ఎదురు చూడాల్సిన పని లేదు. అయితే సమాచారం ప్రకారం మంచి కథ రెడీ చేసుకున్నా కిరీటి మంచి డైరెక్టర్ కోసం వెతుకుతున్నారట. మరి తన నెక్స్ట్ మూవీ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. ప్రస్తుతం టాలీవుడ్‌లో పోటీ తీవ్రంగా ఉన్నా, కష్టపడే తత్వం కలిగిన హీరోలకు ఎప్పుడూ అవకాశం అందుబాటులో ఉంటాయి. కిరీటి సరిగ్గా కథను ఎంచుకుంటే, మంచి దర్శకుడితో పనిచేస్తే స్టార్‌డమ్ అందుకోవడం పెద్ద విషయం కాదు.
