Site icon NTV Telugu

Laapataa Ladies: ఆస్కార్ రేసులో సూపర్ హిట్ మూవీ.. కథ అదిరిపోయింది.. చూశారా?

Laapataa Ladies

Laapataa Ladies

Laapataa Ladies announced as India’s official entry for the Oscars: సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మాజీ భార్య, దర్శకురాలు కిరణ్‌రావు రూపొందించిన ‘లాపతా లేడీస్‌’ చిత్రం ఈ ఏడాది మార్చిలో థియేటర్లలో విడుదలై విమర్శకులతో పాటు కామన్ ఆడియన్స్ ను సైతం ఆకట్టుకుంది. ఫన్నీ కామెడీతో సమాజంలో మహిళల గుర్తింపు గురించి ప్రశ్నలను లేవనెత్తిన ఈ చిత్రం ఈ సంవత్సరం ఎక్కువగా చర్చించబడిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా చూసి చాలా మంది సోషల్ మీడియాలో ఈ ఏడాది ఆస్కార్ అవార్డులకు ఈ సినిమాను ఇండియా నుంచి పంపించాలని అన్నారు. ఎట్టకేలకు ప్రేక్షకుల ఈ డిమాండ్ నెరవేరింది. ‘లాపతా లేడీస్‌’ ఈ సంవత్సరం ఆస్కార్‌కి ఇండియన్ అఫీషియల్ ఎంట్రీ ఫిలింగా నిలిచింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ 29 చిత్రాల జాబితా నుండి ‘లాపతా లేడీస్‌’ని ఆస్కార్ 2025కి అధికారిక ఎంట్రీగా ఎంపిక చేసింది.

Harish Shankar: నక్క తోక తొక్కిన హరీష్ శంకర్

కమిటీ ముందు సమర్పించిన 29 చిత్రాల జాబితాలో ‘యానిమల్’, ‘ఆట్టం’ వంటి సినిమాలు కూడా ఉన్నాయి. గత ఏడాది టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘లాపతా లేడీస్‌’ మొదటి ప్రదర్శన జరిగింది, అక్కడ అది అద్భుతమైన ప్రశంసలను అందుకుంది. కిరణ్ రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ర్చి 2024లో పరిమితమైన స్క్రీన్‌లలో విడుదలైనా ఓటీటీలో వచ్చాక ఎక్కువ మంచి ప్రేక్షకులకు దగ్గరైంది. 5 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందని సమాచారం. ఈ సినిమాలో నటించిన నటులు నటులు నితాన్షి గోయల్, ప్రతిభా రంతా, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్ మరియు రవి కిషన్ కూడా చాలా ప్రశంసలు అందుకున్నారు. మహిళలకు సంబందించిన సున్నితమైన అంశంపై అద్భుతమైన చిత్రాన్ని రూపొందించినందుకు కిరణ్ రావు దర్శకత్వం గురించి కూడా చాలా చర్చ జరిగింది.

సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నిర్మించిన ‘లాపతా లేడీస్‌’కి ఆయన మాజీ భార్య, చిత్ర దర్శకురాలు కిరణ్‌రావు సహ నిర్మాత. ఇది అమీర్ నిర్మాణంలో రూపొందిన నాలుగో చిత్రం కాగా ఇప్పుడు ఇది భారతదేశం నుండి అధికారిక ఆస్కార్ ఎంట్రీని పొందింది. 2001లో విడుదలైన ‘లగాన్’ అమీర్ నిర్మాణంలో రూపొందిన తొలి చిత్రం, దాన్ని కూడా ఆస్కార్‌కు పంపారు. తరువాత ఆయన నిర్మాణంలో ‘తారే జమీన్ పర్’ – ‘పీప్లీ లైవ్’ కూడా ఆస్కార్ కోసం పంపబడ్డాయి. ‘లగాన్’ సినిమా ఆస్కార్‌కి ఎంపికై విజయం సాధించగా, అమీర్‌ నిర్మించిన మరో రెండు చిత్రాలు షార్ట్‌లిస్ట్‌లోకి రాలేకపోయాయి. అయితే ఇప్పుడు నాల్గవ సారి, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఈ అవకాశాన్ని పొందింద. ఈ సినిమా భారతదేశం యొక్క అధికారిక ఎంట్రీగా ఆస్కార్ రేసులో చేరుతోంది. ‘లాపతా లేడీస్‌’ ప్రయాణం ఆస్కార్‌లో ఎంతవరకు చేరుకుంటుందనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.

Exit mobile version