కన్నడ నటుడు కిరణ్ రాజ్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతోన్నాడు. కన్నడలో రీసెంట్‌గా వచ్చిన ‘బడ్డీస్’ సినిమాతో కిరణ్ రాజ్ హీరోగా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ విజయోత్సాహంతోనే కిరణ్ రాజ్ తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. కిరణ్ రాజ్ హీరోగా కుమారి సాయి ప్రియ సమర్పణలో కణిదరపు రాజేష్, పి. ఉషారాణి ‘విక్రమ్ గౌడ్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. పాశం నరసింహారావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపికా సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తెలుగు, కన్నడ భాషల్లో రూపుదిద్దుకుంటోంది.
జూలై 5 కిరణ్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్ ను మేకర్లు విడుదలచేశారు. ఈ పోస్టర్ లో కిరణ్ రాజ్ పూర్తిగా రగ్గ్డ్ లుక్ లో కనిపిస్తున్నాడు. అందరినీ ఆకట్టుకునేలా ఈ పోస్టర్ ఉంది. పోసాని కృష్ణమురళీ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రానికి లొట్టిపలి రామకృష్ణ సహ నిర్మాతగా, పామరాజు జానకి రామారావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘మంత్ర’ ఆనంద్ సంగీతాన్ని అందిస్తుండగా, రాఘవేంద్ర బి కోలారి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుందని చిత్రయూనిట్ తెలిపింది.