NTV Telugu Site icon

KA public Talk : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కిరణ్ అబ్బవరం

Spl Ka

Spl Ka

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “క” సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి విడుదల చేసారు.

“క” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ మాట్లాడుతూ “క అనే మంచి సినిమాతో మీ ముందుకు ఈ నెల 31న రాబోతున్నాం. “క” సినిమా బ్యాడ్ మూవీ అని మీలో ఎవరైనా అంటే నేను సినిమాలు చేయడం మానేస్తా. ఎవరెవరికి ఎంత నచ్చుతుందో తెలియదు గానీ మంచి ప్రయత్నం అని మాత్రం అంటారు. నేను ప్రామిస్ చేస్తున్నా” అని అన్నారు. కాగా దీపావళి కానుకగా నిన్న రాత్రి ‘క’ స్పెషల్ ప్రీమియర్స్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించారు. సినిమా చూసినా ఆడియెన్స్ కిరణ్ అబ్బవరం చెప్పినట్టుగానే క్లైమాక్స్ అదిరింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ బాగా ఆకట్టుకుంది. హీరో చెప్పినట్టుగా ఇంతవరకు ఎవరు టచ్ చేయని పాయింట్ తో అలరించాడని ‘క’  సినిమాతో కిరణ్ అబ్బవరం హిట్టు కొట్టేసాడని  క్రిటిక్స్ సైతం యూనిట్ ను అభినందిస్తున్నారు.

Show comments