గతేడాది “క” సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం. ఇక ఈ ఏడాది దీపావళి కానుకగా KRAMP అనే మరొక యూత్ ఫుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ దీపావళికి పోటీలో మరో మూడు సినిమాలు ఉన్న కూడా సూపర్ హిట్ టాక్ తో సాలిడ్ హిట్ కొట్టాడు కిరణ్ అబ్బవరం. కిరణ్ కెరీర్ లో 11 వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంతో మలయాళ బ్యూటీ ‘యుక్తి తరేజా’ హీరోయిన్ గా నటించగా జైన్స్ నాని దర్శకత్వం వహించాడు.
Also Read : SSMB29 : మహేశ్ బాబు – రాజమౌళి.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌కు డేట్ ఫిక్స్
హాస్య మూవీస్ బ్యానర్ లో 7 వ సినిమాగా వచ్చిన ఈ సినిమా తొలిరోజు రూ 4.5 కోట్ల గ్రాస్కలెక్షన్స్ తో గుడ్ స్టార్ట్ అందుకుంది. ఇక మొదటి రోజును మించి రెండవ రోజు మరింత ఎక్కువ రాబట్టి వరల్డ్ వైడ్ గా రూ. 11. 3 కోట్లు కొల్లగొటింది. నిన్న దీపావళి వీకెండ్ కావడంతో చాలా సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ పెట్టింది K RAMP. రిలీజ్ అయిన మూడు రోజులకు గాను రూ. 17.5 కోట్లు కలెక్ట్ చేసి కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి సెన్సషన్ క్రియేట్ చేసింది KRAMP. నేటి నుండి అన్ని ఏరియాలలో ఈ సినిమా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవుతోంది. హీరో కిరణ్ అబ్బవరం, నిర్మాత రాజేష్ దండా ఈ సినిమా గురించి ముందు నుండి చెప్పినట్టు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే తమ సినిమాకు రమ్మని చెప్పి ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యారు
