NTV Telugu Site icon

Kingdom; చరణ్ రిజెక్ట్ చేశాకే.. విజయ్ వద్దకు చేరింది

February 7 2025 02 20t145441.637

February 7 2025 02 20t145441.637

ప్రజంట్ ఒక మంచి హిట్ కోసం పాకులాడుతున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ. తోలుతా సైడ్ క్యారెక్టర్లలో న‌టించి త‌ర్వాత హీరోగా మంచి స‌క్సెస్ అందుకున్నాడు విజ‌య్.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఇండ‌స్ట్రీని షేక్ చేశాడు. అయితే గ‌త కొన్నేళ్లుగా ఫ్లాపుల‌తో, ఇబ్బంది ప‌డుతున్న విజయ్ ప్రస్తుతం గౌత‌మ్ తిన్ననూరి ద‌ర్శక‌త్వంలో ‘కింగ్‌డ‌మ్’ అనే మూవీ చేస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన టీజర్‌ ఎలాంటి రెస్పాండ్ అందుకుండో చూశాం. ముఖ్యంగా ఈ మూవీకి తెలుగులో ఎన్టీఆర్‌, తమిళ్‌లో సూర్య, హిందీలో రణ్‌బీర్‌ కపూర్‌ వాయిస్‌ ఇచ్చారు. దీంతో టీజర్‌ మరింత అదిరిపోయింది. అయితే తాజాగా ఈ మూవీ గురించి, రామ్ చరణ్ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది.

Also Read:Samantha: ఇలా ఉండటం చాలా కష్టంగా ఉంది : సమంత

ఏంటీ అంటే ఈ ప్రాజెక్ట్‌ తొలుత రామ్‌చరణ్‌ దగ్గరకు వెళ్లిందట. ఇక మూవీ ప్రారంభం అనగా నో చెప్పడట చరణ్‌. దీంతో కథ నచ్చలేదు అని కొన్ని వార్తలు వచ్చినా.. ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ పనులు పూర్తి కాకపోవడం వల్లనే ఈ మూవీ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా విజయ్‌ దేవరకొండ దగ్గరకు వచ్చింది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో విజయ్ లుక్ ఎంతో డిఫరెంట్‌గా ఉంది. టీజర్ చూశాక మూవీ కోసం అతను ఎంత కష్టపడుతున్నాడో అర్ధం అవుతుంది. మరి అతని కష్టం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.