వెంకటేష్.వి.పి. మలయాళ టీవీ, చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సుడా సుడా ఇడ్లీ అనే రెస్టారెంట్ స్టార్టప్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నారు. ఆయన విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “కింగ్డమ్” సినిమాలో మురుగన్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు డి.జి.పి. వర్కింగ్ టైటిల్ తో వస్తున్న చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. “కె ర్యాంప్” వంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత రుద్రాంశ్ సెల్యులాయిడ్ సంస్థ మరో కొత్త చిత్రాన్ని నిర్మిస్తోంది. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బొమ్మక్ శివ నిర్మిస్తున్న ఈ సినిమాలో “కింగ్డమ్” ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా నటిస్తున్నారు. సురేష్ తేజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి డి.జి.పి. అనే వర్కింగ్ టైటిల్ గా పెట్టుకున్నారు.
ప్రొడ్యూసర్ బొమ్మక్ శివ, డైరెక్టర్ సురేష్ తేజ్ తిరువనంతపురంలో తన రెస్టారెంట్ ఆర్డర్స్ తీసుకుంటున్న హీరో వెంకటేష్ తో ఫోన్ లో మాట్లాడి తమ సినిమాలో హీరోగా తీసుకుంటున్నట్లు చెబుతారు. విలన్ రోల్ కు ఆఫర్ ఇస్తున్నారని అనుకున్న వెంకటేష్ పెద్దగా ఆసక్తి చూపించడు. కానీ తనను విలన్ రోల్ కోసం కాదు, హీరోగా తమ సినిమాకు తీసుకుంటున్నామని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు. ఈ మూవీ స్క్రిప్ట్ విని మరింత ఇంప్రెస్ అవుతాడు హీరో. ఇలా సరదాగా చేసిన ఈ వీడియో ఫన్ గా ఉండి నవ్విస్తోంది.

