Site icon NTV Telugu

Kicha Sudeep: అంపశయ్యపై అమ్మ.. బిగ్ బాస్ లో కొడుకు

Kicha Sudeep

Kicha Sudeep

కన్నడ స్టార్ హీరో కిచ్చాసుదీప్‌ తల్లి సరోజా సంజీవ్ ఆదివారం కన్నుమూశారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె మరణంపై కిచ్చా సుదీప్‌ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు. ఇన్ని రోజులూ మనిషి రూపంలో నా పక్కన తిరిగిన దేవత మా అమ్మ, నాకు తొలి గురువు. నా తొలి అభిమాని. నేను ఎలా నటించినా ఇష్టపడేది. ఇప్పుడు ఆమె ఓ అందమైన జ్ఞాపకం మాత్రమే అంటూ ఎమోషనల్ అయ్యరు. 24 గంటల్లో అంతా మారిపోయింది. నేను అనుభవిస్తున్న బాధను వ్యక్తపరచడానికి కూడా మాటలు రావడం లేదు. ఆమె లేదనే విషయాన్ని నేనింకా అంగీకరించలేకపోతున్నా అని ఆయన అన్నారు. ఇకపై నాకు ‘గుడ్‌ మార్నింగ్‌ కన్నా’ అనే మెసేజ్‌ రాదు.

Lucky Baskhar Trailer : ఆసక్తి పెంచేస్తున్న లక్కీ భాస్కర్ ట్రైలర్

శుక్రవారం చివరిసారి మెసేజ్‌ పెట్టింది. శనివారం బిగ్‌బాస్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఆమె ఆసుపత్రిలో చేరినట్లు ఫోన్‌ వచ్చింది. డాక్టర్లతో మాట్లాడి షో వేదికపైకి వెళ్లా, మనసులో ఎంత బాధ ఉన్నా బాధ్యతగా షూటింగ్‌ చేశా. షూటింగ్‌ అయిపోయాక ఆసుపత్రికి వెళ్లేసరికి ఆమెను వెంటిలేటర్‌పై ఉంచారు, అయితే ఆమె స్పృహలో ఉన్నప్పుడు చూడలేకపోయాను. ఆదివారం ఉదయం ఆమె నాకు శాశ్వతంగా దూరమైంది. చూస్తుండగానే కొన్ని గంటల్లో అంతా మారిపోయింది. నేను షూటింగ్‌కు వెళ్తున్నప్పుడు నన్ను హత్తుకొని జాగ్రత్తలు చెప్పిన మా అమ్మ కొన్ని గంటల్లోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది’ అని కిచ్చా సుదీప్‌ తన ఆవేదన వ్యక్తం చేశారు.

Exit mobile version