Site icon NTV Telugu

Kichcha Sudeep: ప్లీజ్ ఎవ్వరు నా ఇంటికి రాకండి.. ఈగ విలన్ షాకింగ్ పోస్ట్ వైరల్

Kichha

Kichha

Kichcha Sudeep: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటిస్తున్న ‘బిల్లా రంగా బాషా’ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుంది. అనూప్ బండారి డైరెక్షన్ వహిస్తున్న ఈ మూవీని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. కాగా, ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే, కిచ్చా సుదీప్ తన పుట్టినరోజు సమీపిస్తుండటంతో ఈ సందర్భంగా అభిమానులకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు.

Read Also: Rowdy Sheeter Srikanth Parole: రౌడీ షీటర్‌ శ్రీకాంత్‌ పెరోల్‌ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌ ..!

తాజాగా, సెప్టెంబర్ 2న తన పుట్టినరోజుకు సంబంధించి అభిమానులకు ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి చేశారు కిచ్చా సుదీప్. పుట్టినరోజు నాడు తన ఇంటి దగ్గర రచ్చ చేయవద్దని ఫ్యాన్స్ ను ఎక్స్ (ట్విట్టర్) ద్వారా కోరారు. “ప్రియమైన మిత్రులారా.. సెప్టెంబర్ 2న రాత్రి 1 గంటకు కలుద్దాం.. మీరు నన్ను కలవాలని ఎంతగానో వేచి చూస్తున్నారో, నేను కూడా మీకోసం అంతే ఆసక్తిగా ఎదురు చూస్తాను.. కానీ, మీరు నా పుట్టినరోజున చేసే వేడుకల వీడియోలు చూసిన ప్రతిసారి, తిరిగి పుట్టినట్లు అనిపిస్తుంది.. ఇది నాకు చాలా సంతృప్తిని ఇస్తుందన్నారు. అందుకే దశాబ్దాలుగా నేను నా పుట్టినరోజును మీతో కలిసి నా ఇంటి వద్ద జరుపుకుంటున్నాను.. కానీ ఈసారి అది కష్టం అని రాసుకొచ్చారు.

Read Also: Mahindra University: మహేంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం.. వైస్ ఛాన్సలర్ ఏమన్నారంటే?

అయితే, మా అమ్మ లేని మొదటి ఏడాది ఇది.. ఆమె లేకుండా ఈ పుట్టినరోజు వేడుకను జరుపుకోవడం నాకు కష్టంగా ఉందని హీరో కిచ్చా సుదీప్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. కానీ, నేను మిమ్మల్ని నిరాశపర్చాలనుకోవట్లేదు.. అందుకే నా బర్త్ డే రోజున రాత్రి 12 గంటలకు మీ శుభాకాంక్షలు మాత్రమే నాకు చెప్పండి.. సెప్టెంబర్ 1న రాత్రి అందరం కలిసి ఒకచోట మీటింగ్ పెట్టుకుందాం.. ఆ స్థలం ఎక్కడ అనేది నేను మీకు త్వరలోనే చెబుతాను అన్నారు. దయచేసి సెప్టెంబర్ 2న మాత్రం నా ఇంటి దగ్గరకు ఎవ్వరు కూడా రావొద్దని సూచించారు. ఆ రోజు నేను ఇంట్లో ఉండను.. నేను లేనని తెలిసి కూడా మీరు అక్కడికి వచ్చి గొడవలు చేయడం.. నన్ను మరింత బాధ పెడుతుందని కన్నడ స్టార్ హీరో సుదీప్ భావోద్వేగపూరితంగా పోస్ట్ పెట్టాడు.

Exit mobile version