Site icon NTV Telugu

War 2 : CGI కాదు.. నిజంగానే షూటింగ్ చేశారు! కియారా బికినీ BTS వీడియో వైరల్

Kiara’s Bikini Scene

Kiara’s Bikini Scene

బాలీవుడ్‌లో అత్యంత హైప్‌తో వస్తున్న సినిమా ‘వార్ 2’. ఇందులో కియారా అద్వానీ బికినీ షాట్ గురించి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ‘అది ఒరిజినల్ కాదు, కంప్యూటర్‌ జనరేటెడ్ ఇమేజరీ (CGI) తో క్రియేట్ చేశారు’ అంటూ పుకార్లు వెలువడ్డాయి. కానీ ఇప్పుడు ఆ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ, కొత్త BTS (Behind The Scenes) వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో కియారా నిజంగా బికినీ షాట్ కోసం ఎలా ప్రిపేర్ అయిందో స్పష్టంగా చూపించారు. ఆమె ప్రాక్టీస్, షాట్ సెటప్, కాస్ట్యూమ్ డిజైనర్ – అన్నీ విడిగా చూపిస్తూ అసలు అది CGI కాదని సూటిగా సమాధానం ఇచ్చారు.

టీజర్ రిలీజ్ అయిన వెంటనే ఈ బికినీ సీన్ వైరల్ కావడం, ఆపై నకిలీ అనే వాదనలు వచ్చేసరికి యూనిట్ ఈ వీడియోతో స్పందించింది. నిజానికి, విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు అసలు ఫుటేజ్‌ను బలంగా బ్యాలెన్స్ చేయడం, సినిమాకు ఉన్న ప్రత్యేకతల్లో ఒకటి గా నిలుస్తోంది.ఈ షాట్ కోసం కియారా పెట్టిన కృషి ఇప్పుడు అందరికీ స్పష్టమవుతోంది. గ్లామర్ చూపించడమే కాకుండా, నటిగా శ్రమిస్తూ తన పాత్రను న్యాయం చేకూరుస్తోంది అనిపిస్తుంది. ఇర హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో, స్టైలిష్ యాక్షన్‌తో రూపొందిన ఈ సినిమా అభిమానుల అంచనాలను పెంచేస్తోంది.

 

Exit mobile version